Viral Video: రైతు వినూత్న ఆలోచన !! ఆవులకు మ్యూజిక్ పెట్టి ?? వీడియో
టర్కీలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన ఆవులకి వర్చువల్ రియాలిటీ గాగుల్స్ పెట్టాడు. దీంతో అవి వేసవి కాలంలో బహిరంగ మైదానంలో మేస్తున్నట్లుగా అనుభూతి చెందుతున్నాయి.
టర్కీలో ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన ఆవులకి వర్చువల్ రియాలిటీ గాగుల్స్ పెట్టాడు. దీంతో అవి వేసవి కాలంలో బహిరంగ మైదానంలో మేస్తున్నట్లుగా అనుభూతి చెందుతున్నాయి. ఈ పద్దతి ఆవులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో ఆవులు సంతోషంగా ఎక్కువ పాలు ఇవ్వడం ప్రారంభించాయి. టర్కీలోని అక్సరయ్ నగరానికి చెందిన ఇజ్జత్ కోకాక్ పాల ఉత్పత్తిని పెంచుకోడానికి ఇలా ప్రయత్నించాడు. వేసవిలో ఆవులు నీలి ఆకాశం కింద బహిరంగ ప్రదేశాల్లోనూ, పొలాల్లో మేస్తున్నట్లుగా వాటికి అనుభూతి కలిగించాడు. ఇందుకు ఆవుల కళ్లకు వర్చువల్ రియాలిటీ గాగుల్స్ పెట్టాడు. దీంతో ఆవులు ఆరుబయట పచ్చటి పచ్చిక బయళ్లలో స్వేచ్చగా తిరుగుతున్నట్లు భావిస్తున్నాయి. పచ్చటి ప్రకృతి దృశ్యాలు, పక్షుల శబ్దాలు ఆవులను సంతోషపరుస్తున్నాయి. దీంతో అవి ఎక్కువ పాలు ఇస్తున్నాయి. వాటి పాల ఉత్పత్తి రోజుకు 22 లీటర్ల నుంచి 27 లీటర్లకు పెరిగాయి.
Also Watch:
TOP 9 NEWS: సంచలనంగా మారిన విజయవాడ చిన్నారి దీక్షిత సూసైడ్.. వీడియో
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

