రైతు వినూత్న ఆలోచన.. దెబ్బకు అడవి పందులు పరార్..(Video)
ఓ రైతు తన పంటను అటవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు వినూత్న ప్రయోగం చేశాడు. పంట నాశనం చేస్తున్న అడవిపందులకు తన సరికొత్త ఆలోచనతో చెక్ పెట్టాడు.
ఓ రైతు తన పంటను అటవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు వినూత్న ప్రయోగం చేశాడు. పంట నాశనం చేస్తున్న అడవిపందులకు తన సరికొత్త ఆలోచనతో చెక్ పెట్టాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని చోండి గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతు కొత్తగా ఆలోచించాడు. తనకు ఉన్న 3 ఎకరాల పొలంలో పత్తి పంట సాగు చేస్తున్నాడు లక్ష్మణ్. అయితే, ఆ చేనును అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయి. అడవిపందులతో విసిగిపోయిన రైతు ఆలోచనలో పడ్డాడు. వాటిని ఎలాగైనా తరిమికొట్టాలనుకున్నాడు. ఏం చేద్దామా అని ఆలోచించాడు. అతనికి ఓ ఆలోచన వచ్చింది. పాత పద్ధతినే కాస్త వినూత్నంగా అమలుచేసాడు. పూర్వం పంటను పక్షుల బారినుంచి కాపాడుకోడానికి గడ్డితో తయారుచేసిన దిష్టిబొమ్మలకు ఒక కుండను తలగా తగిలించి పొలంలో ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం లక్ష్మణ్ కూడా అదే పద్ధతిని కాస్త వెరైటీగా ఉపయోగించాడు. మనుషుల రూపంలో ఉన్న బొమ్మలను తయారు చేసి పంట చేనులో పెట్టాడు. ఒక ఆడ బొమ్మ, ఒక మగ బొమ్మను తయారు చేసి తన చేనుకు రక్షణగా ఏర్పాటు చేశాడు.
