బ్రతుకు పోరాటం..తాళ్ల పై నడుస్తూ ప్రమాదకర ప్రయాణం.. ఎక్కడంటే(Video)
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయింది. అయినప్పటికీ నేటికీ కనీస సదుపాయాలకు దూరంగా ఉన్న అనేక గ్రామాలున్నాయి. తాగడానికి నీరు, రవాణా సౌకర్యాలు వంటి కనీస సదుపాయాలకు ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయింది. అయినప్పటికీ నేటికీ కనీస సదుపాయాలకు దూరంగా ఉన్న అనేక గ్రామాలున్నాయి. తాగడానికి నీరు, రవాణా సౌకర్యాలు వంటి కనీస సదుపాయాలకు ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని మన్యం జిల్లాల్లో అనేక గ్రామాలు రహదారి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.. స్కూల్ కు వెళ్లాలన్నా, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా, గర్భణీ స్త్రీలైనా అనేక ఇబ్బందులు పడాల్సిందే.. తాజాగా అల్లూరి జిల్లాలో వాగు దాటడం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తాళ్ళపై ప్రయాణం చేస్తున్నారు కొంతమంది గ్రామస్థులు. జిల్లాలోని రంపచోడవరం బందమామిడి గ్రామస్తులు రహదారి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాగు మీద వంతెన లేకపోవడంతో.. స్టూడెంట్స్ స్కూల్ కు వెళ్లాలన్నా, గ్రామస్తులు ఏదైనా పనికోసం గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా వాగుని దాటడం కోసం తాళ్లను ఆశ్రయిస్తున్నారు. తాళ్లపై నడుచుకుంటూ ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. తమ గ్రామం నుంచి రంపచోడవరం వెళ్లాలంటే రోడ్లు సదుపాయం లేక, ఉన్న రహదారి చాలా దూరం కావడంతో.. గిరిజనులు వాగుపై తాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. తాళ్లనే బ్రిడ్జిగా చేసుకుని ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తున్నారు. తాళ్లపై సర్కస్ ఫీట్లు చేస్తూ .. నానా అవస్థలు పడుతున్నారు.
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

