బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో

Updated on: Apr 10, 2026 | 12:54 PM

విజయవాడలోని ఓ బార్బర్ షాపు యజమాని పేరు మీద నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేశారు. చేదోడు పథకం కోసం దరఖాస్తు చేయగా, జీఎస్టీ ఉందని తిరస్కరించారు. పోలీసులను, జీఎస్టీ అధికారులను ఆశ్రయించినా చర్యలు లేకపోవడంతో ₹72 లక్షలు కట్టాలని నోటీసులు వచ్చి, బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. న్యాయం కోసం బాధితుడు వేడుకుంటున్నారు.

విజయవాడలోని పంజా సెంటర్ లో బార్బర్ షాప్ నడుపుకుంటున్న ఒక వ్యక్తి నకిలీ జీఎస్టీ స్కామ్ బారిన పడ్డారు. తన పేరు మీద జీఎస్టీ రిజిస్టర్ అయిందని తెలియని ఆయన, చేదోడు పథకం కోసం దరఖాస్తు చేయగా, మీ పేరు మీద జీఎస్టీ ఉందని అధికారులు నిరాకరించారు. దీంతో బాధితుడు ఆందోళనకు గురయ్యారు. అధికారులను విచారించగా, వైజాగ్ లో ఆయన పేరు మీద నకిలీ జీఎస్టీ ఓపెన్ అయినట్లు వెల్లడైంది. వెంటనే విజయవాడ పోలీస్ కమిషనర్, ఆటో నగర్ జీఎస్టీ అధికారులను కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ, సరైన చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆరోపించారు. ఫిబ్రవరిలో ₹72 లక్షలు కట్టాలని జీఎస్టీ నోటీసులు రావడంతో పాటు తన బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూతురికి విడాకులు మంజూరు.. కోర్టు బయట బ్యాండ్‌ మేళంతో.. వేడుక చేసిన తండ్రి

నో ఫుడ్‌, నో ఫోన్‌.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్‌ చేస్తే !!

Mrunal Thakur: పెద్దిలో ఐటం సాంగ్‌.. తెలివిగా తప్పించుకున్న మృణాల్‌

మేకోవర్‌ టాపిక్‌.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌, నీల్‌

Loading...
Unable to load recommendations.
Follow Us