మహిళ మెడలో గొలుసు కొట్టేయాలనుకున్నాడు.. చివరికి

Updated on: Aug 20, 2025 | 12:29 PM

ఇటీవల దొంగలు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు దొంగలు చోరీలకు వెళ్లి అదే ఇళ్లలో వంట చేసుకొని భోజనం చేసి, ఉదయం పోలీసులు వచ్చి బేడీలు వేసేవరకూ హాయిగా నిద్రపోయిన ఘటనలు చూశాం. తాజాగా ఓ గొలుసు దొంగ మహిళ మెడలో గొలుసు కొట్టేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తిరిగి అదే మహిళ వద్ద డబ్బులు అడిగి తీసుకొని వెళ్లిన ఘటన థాయ్‌లాండ్‌లో జరగింది.

థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి మహిళ మెడలోని బంగారు గొలుసు చోరికి యత్నించి విఫలమై.. ఆ మహిళకు క్షమాపణలు చెప్పాడు. ఆ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ కాగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో.. ఓ మహిళ రోడ్డుపై వెళ్తుండగా ఓ వ్యక్తి ముఖానికి మాస్క్‌ , హెల్మెట్‌ పెట్టుకొని ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో గొలుసు తెగిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆమె అతడిని చాకచక్యంగా పట్టుకొని ఆపింది. ఆ మహిళ పోలీసులను పిలుస్తుందని భయపడ్డాడో లేక నలుగురినీ పిలిచి దేహశుద్ధి చేయిస్తుందని భావించాడో కానీ వెంటనే ఆ దొంగ రెండు చేతులు జోడించి ఆ మహిళను క్షమించమని వేడుకున్నాడు. అంతేకాదు, తనకు డబ్బు చాలా అవసరముందని డబ్బులు ఉంటే ఇవ్వమని వినయంగా అడిగాడు. ఊహించని పరిణామానికి షాకయిన ఆ మహిళ తేరుకొని 100 భాట్‌ అంటే భారతీయ కరెన్సీలో రూ.270ల క్యాష్‌ని అతని చేతుల్లో పెట్టింది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చేసిన అపరాధానికి క్షమాపణలు తెలిపిన మంచి దొంగ అని ఓ నెటిజన్‌ కామెంట్ చేస్తే..మరొకరు అతనికి దొంగతనం చేయడం కూడా రాదు బ్రో అని కామెంట్‌ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాన్సర్ నుంచి శాశ్వత విముక్తి..అందుబాటులోకి ‘రివర్ట్’ టెక్నాలజీ

వాట్సాప్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఇక కాల్స్‌ షెడ్యూలింగ్ సాధ్యమే

మీ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందా

హీరోగా డైరెక్టర్ తేజ కుమారుడు.. హీరోయిన్‌గా కృష్ణ మనవరాలు

రజినీని చూపిస్తూ.. స్టార్ హీరోలకు సజ్జనార్ చురకలు