నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
ఉత్తర కర్ణాటకలోని సిర్సిలో ఉన్న శల్మల నదిలోని సహస్రలింగం అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ వేల శివలింగాలు, నందులు నది రాళ్లపై చెక్కబడి ఉన్నాయి. 17వ శతాబ్దంలో రాజు సదాశివరాయలు వీటిని ప్రతిష్ఠించారు. కార్తీకమాసం, మహాశివరాత్రికి భక్తులు అధికంగా వస్తారు. ఈ ప్రదేశం చరిత్ర, భక్తి, పర్యాటకాన్ని మేళవించి, ఔషధ గుణాలున్న నీటితో ఆకట్టుకుంటుంది.
ఉత్తర కర్ణాటకలోని సిర్సీ ప్రాంతంలో పారే శల్మల నదిలో ఓ విచిత్రం చూడొచ్చు. ఈ నదిలో శివ లింగాలు కనిపిస్తాయి ప్రతి లింగానికి ఎదురుగా నంది ఉండటాన్ని చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. దట్టమైన అడవులు గుండా ఈ నది ప్రవహిస్తుంది. సాధారణంగా కార్తీకమాసం, మహాశివరాత్రి సమయాల్లో భారీగా భక్తులు తరలివస్తుంటారు. సహస్రలింగా అని పిలవబడే ఈ ప్రాంతం భక్తితో మాత్రమే కాదు పర్యాటకులను కూడా ఆ ప్రదేశం కట్టిపడేస్తుంది. స్థల పురాణంప్రకారం 1678 -1718 ప్రాంతాల్లో విజయనగర సామ్రాజ్యా సామంతుడు సదాశివరాయలు ఇక్కడ వేయి లింగాలను చెక్కించారని అంటారు. సంతానం లేని ఆ రాజు పరమశివుడిని ప్రార్థించి…తనకు సంతానం కలిగేలా చేస్తే సహస్ర లింగాలను చెక్కిస్తానని మొక్కుకున్నాడట. కుమార్తె జన్మించడంతో శంకరుడిని ప్రార్థిస్తూ ఇక్కడి రాళ్లపై చిన్న చిన్న శివలింగాలను వాటికి ఎదురుగా నందులను చెక్కించాడు. వెయ్యి లింగాలు చెక్కిస్తానని రాజు మొక్కుకున్నప్పటికీ ఈ నదిలో వేయి కన్నా ఎక్కువే ఉన్నాయట. కాంబోడియాలోని ఓ ప్రాంతానికి ఇక్కడికి పోలికలున్నట్లు చరిత్రకారులు చెబుతారు. కేబాల్ స్పీన్ నదిలో కూడా ఇలాగే వెయ్యి శివలింగాలు వాటి ఎదుట నందులు ఉన్నాయట. నదిలో ప్రవాహం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి సమయంలో ప్రవాహం కాస్త తగ్గుతుంది..ఆ సమయంలో నదిలోకి దిగి మరీ పూజలు చేస్తారు భక్తులు. కార్తీకమాసంలో ఒడ్డు నుంచే పూజలు చేస్తారు. లింగాల మీదుగా పారే నదీ నీళ్లు ఔషధ గుణాలతో నిండి ఉంటాయని సమీప ప్రాంతాల పొలాలను సస్యశ్యామలం చేస్తాయని స్థానికులు నమ్ముతారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2026 రైల్వే జాబ్ క్యాలెండర్ రెడీ
BSNL బ్రాడ్‌బాండ్ ఫ్లాష్ సేల్.. బెనిఫిట్స్ ఇవే
ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా? సొమ్ము చేసుకున్న విదేశీ బ్రాండ్