మానవ శరీర భాగాలు .. బ్లాక్ మార్కెట్‌లో విక్రయాలు..
అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ మార్చురీలో పనిచేసిన మాజీ మేనేజర్ మృతదేహాల నుంచి తలలు, మెదళ్లు, అవయవాలను వేరు చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించాడు. పీపుల్ మ్యాగజైన్ ప్రకారం.. 57 ఏళ్ల సెడ్రిక్ లాడ్జ్ ఒక వ్యక్తి మూడేళ్ల కాలంలో దాదాపు 37,355 డాలర్లు అంటే మన కరెన్సీలో 32 లక్షల రూపాయలు పే పాల్ ద్వారా చెల్లించాడు.
చెల్లింపుల సమయంలో ‘‘హెడ్ నంబర్ 7’’ వంటి అనుమానాస్పద పదాలు ఉన్నట్లు గుర్తించారు. మసాచుసెట్స్‌లోని ఒక మహిళకు మానవ చర్మాన్ని సరఫరా చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతేడాది పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పెన్సిల్వేనియాలోని ఒక ఫెడరల్ కోర్టులో విచారణ సందర్భంగా అతడు నేరాన్ని అంగీకరించాడు. 2018- 2020 మధ్య వైద్య పరిశోధన కోసం హార్వర్డ్ అనాటమికల్ గిఫ్ట్ ప్రోగ్రామ్‌కు విరాళంగా ఇచ్చిన మార్చురీలోని శవాల నుంచి శరీర భాగాలను దొంగలించి.. వాటిని డార్క్ వెబ్‌సైట్లలో అంతర్రాష్ట్ర రవాణా చేసినట్లు సెడ్రిక్ లాడ్జ్ తెలిపాడు. బోస్టన్‌లోని హార్వర్డ్ మార్చురీ నుంచి దొంగలించిన శరీర భాగాలను సెడ్రిక్ తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచేవాడినని.. అనంతరం వాటిని తన భార్య సహకారంతో రాష్ట్రాల సరిహద్దుల మీదుగా బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేవాడినని తెలిపాడు. ఒక్కోసారి కొనుగోలుదారులు నేరుగా అతడి నివాసానికి వచ్చి అవయవాలను తీసుకెళ్లేవారని చెప్పాడు. వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడాలని సేవాభావంతో దానం చేసిన మృతదేహాల అవయవాలను అక్రమ రవాణా చేసినందుకు అతడికి పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరి పైనా కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్ మసాచుసెట్స్, న్యూహాంప్‌షైర్, పెన్సిల్వేనియాలో విస్తరించినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పసిపిక్ మహాసముద్రం పూర్తిగా కనుమరుగు కాబోతుందా?
సూదితో పొడవకుండానే రక్త పరీక్ష.. దేశంలో ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో
కింగ్ నాగ్ క్రేజీ డెసిషన్.. జైలర్‌కు తనేంటో చూపించేందుకు రెడీ!
ఒకప్పుడు తోపు హీరోయిన్.. యాక్సిడెంట్‌తో మతిమరుపు.. సన్యాసిగా జీవితం