గురు గ్రహానికి చందమామలాంటి.. యూరోపాలో మహా సముద్రం

|

Oct 16, 2024 | 9:54 PM

గురు గ్రహానికి చందమామ లాంటి యూరోపాపై జీవం పుట్టుకకు అవకాశముందా? లేదా? అన్న పరిశోధనలో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నాసా ‘యూరోపా క్లిప్పర్‌’ అంతరిక్ష నౌకను ప్రయోగిస్తోంది. ‘స్పేస్‌ ఎక్స్‌’సంస్థకు చెందిన ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ దాన్ని నింగికి మోసుకెళ్లనుంది.

భూమ్మీది సముద్రాల్లో మాదిరిగా యూరోపాలోని సముద్రంలోనూ రసాయన క్రియల వల్ల హైడ్రోథర్మల్‌ వెంట్స్‌ ఏర్పడే అవకాశముందనీ ఇవి పర్యావరణ వ్యవస్థలకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. గ్రహాంతర అన్వేషణలో ‘నాసా’ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో అతి పెద్దది ‘యూరోపా క్లిప్పర్‌’. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 42 వేల కోట్లు. భారీ అంతరిక్ష నౌక అయిన క్లిప్పర్‌కు పరిశోధనలు చేయాలన్నా, సేకరించిన డేటాను భూమికి ప్రసారం చేయాలన్నా అధిక శక్తి అవసరం. అందుకే పెద్ద సోలార్‌ ప్యానెల్స్‌ను అమర్చారు. ఐదున్నరేళ్లలో అది సుమారు 290 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 2030 ఏప్రిల్‌లో గురుగ్రహం కక్ష్యలోకి చేరుతుంది. అనంతరం గురుడి కక్ష్యలో కుదురుకుని చంద్రుడైన యూరోపా చెంతకు వెళ్ళేందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఇందుకు మరో ఏడాది పడుతుంది. అనంతరం మూడేళ్లపాటు గురుడి కక్ష్యలోనే క్లిప్పర్‌ నౌక పరిభ్రమిస్తూ 49 సార్లు యూరోపా దగ్గరకెళ్లి అధ్యయనం చేస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊళ్లో ఎక్కడ చూసినా కవలలే.. 50 శాతం ప్రసవాల్లో ట్విన్సే పుడతారు

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

సిద్ధిఖి కుమారుడిని కూడా చంపేయండని.. షూటర్లకు బిష్ణోయ్‌ గ్యాంగ్ కాంట్రాక్ట్

పైనాపిల్ తింటే క్యాన్సర్ రాదా ?? నిపుణులు ఏం చెప్పారంటే ??

Devara OTT: అప్పుడే OTTలోకి దేవర.. డేట్ ఫిక్స్ !!

 

 

Follow us on