Upadhi: ఉపాధి హామీ మట్టి పనులు చేస్తుండగా బయటపడిన పురాతన కుండ.. దాన్ని ఓపెన్ చేయగా షాక్..
నంద్యాల జిల్లా డోన్ మండలం చనుగొండ్ల గ్రామంలో జూన్ 1వ తారీఖున ఉపాధి హామి కూలీలు మట్టి పని చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తవ్వకాలు జరుపుతుండగా..
నంద్యాల జిల్లా డోన్ మండలం చనుగొండ్ల గ్రామంలో జూన్ 1వ తారీఖున ఉపాధి హామి కూలీలు మట్టి పని చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తవ్వకాలు జరుపుతుండగా.. ఓ పురాతన కుండ బయటపడింది. ఆ కుండను ఓపెన్ చేయగా నిధి కనిపించింది. అందులో పదుల సంఖ్యలో తెల్లటి నాణేలను గుర్తించారు. అవి తెల్లగా ఉండడంతో.. వారు వెండి నాణేలుగా భావించారు. ఒకే కుటుంబానికి చెందిన 15 మంది కూలీలు.. దొరికిన నాణేలను సూపర్‌వైజర్‌కు అప్పగించకుండా వారి ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే ఈ వార్త మండలంలో విపరీతంగా సర్కులేట్ అయ్యింది. వారికి వెండి నాణేలు కుప్పలు తెప్పులుగా దొరికాయని ప్రచారం జరిగింది. సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ అధికారులు వెంటనే గ్రామానికి వెళ్లి గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొందరి ఇళ్లకు వెళ్లి అడగ్గా… తొలుత తమకు దొరికినవి ఇవే అంటూ 3.66 కిలోల నాణేలను అందజేసినట్లు డోన్ తహశీల్దార్ వై.నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి మరోసారి గ్రామానికి వెళ్లి పలువురి వద్ద నుంచి 21 కిలోల నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నాణేల మొత్తం బరువు 24.66 కిలోలు అని తెలిపారు. వాటిలోని కొన్ని నాణేలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపగా తాజాగా రిపోర్ట్ వచ్చింది. అవి సీసం అచ్చులు అని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. వాటిని సబ్ రిజిస్టర్ ఆఫీసులో భద్రపరిచి కలెక్టర్‌కి సమాచారం ఇచ్చామని తహశీల్దార్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

