ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

Updated on: Apr 01, 2026 | 6:25 PM

ఏలూరు జిల్లా నెమలిపేట గ్రామస్థులు పిల్లల ఆరోగ్యం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఐస్‌క్రీం అమ్మకాలు, వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. రసాయనాలు, నాణ్యత లేని ఐస్‌క్రీంల వల్ల పిల్లలకు జీర్ణకోశ సమస్యలు, ఇతర అనారోగ్యాలు వస్తున్నాయని గుర్తించి ఈ చర్య తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తున్నారు. "ఆరోగ్యమే మహాభాగ్యం" అని చాటి చెప్పి, దేశానికే ఆదర్శంగా నిలిచింది ఈ గ్రామ ఐక్యత.

వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ గల్లీలో ఐస్‌క్రీం బండ్ల గంటలు వినిపిస్తుంటాయి. కానీ, ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నెమలి పేట గ్రామంలో మాత్రం ఆ గంట వినిపిస్తే జరిమానాల మోత మోగుతాయి. తమ పిల్లల ఆరోగ్యం కోసం ఆ గ్రామస్తులంతా కలిసి ఐస్‌క్రీం అమ్మకాలను, వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు తమ నిర్ణయాన్ని కేవలం మాటలతో ఆపకుండా, ఊరి పొలిమేరల్లోనే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చి ఎవరైనా ఐస్‌క్రీంలు అమ్మితే రూ.3,000 జరిమానా. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా కొని తింటే వారికి రూ. 1,000 జరిమానా విధిస్తారు. రంగుల నీళ్లు, నాణ్యత లేని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి అమ్మే ఐస్‌క్రీంల వల్ల పిల్లలకు జీర్ణకోశ సమస్యలు, తలనొప్పి, దగ్గు, జలుబు వంటి వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు గుర్తించారు. భవిష్యత్తులో ఈ రసాయనాల వల్ల క్యాన్సర్ వంటి ముప్పు పొంచి ఉందనే ఆందోళనతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. సాధారణంగా నగరాల్లో చదువుకున్న వారు కూడా పిల్లల మారాం చూసి హానికరమైన పదార్థాలను కొనిస్తుంటారు. కానీ, ఏజెన్సీ ప్రాంతంలోని నేమిలిపేట గ్రామస్తులు “డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యం” అని నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కల్తీ రాయుళ్లకు చెక్ పెట్టేలా సాగుతున్న ఈ గ్రామ ఐక్యమత్యాన్ని నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల ‘కింగ్ కోబ్రా’.. వణికిపోయిన గ్రామస్తులు

Follow Us