అందం ఎరగా వేసి అమ్మాయిలతో న్యూడ్‌ కాల్స్‌.. ఆ తర్వాత

Updated on: Nov 15, 2025 | 12:07 PM

అందాన్ని అడ్డుపెట్టుకొని అమాయక మహిళలను న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఏలూరు క్రికెటర్ వెంపాటి జస్విన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలింతలను కూడా మోసం చేయడం ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. ఆన్‌లైన్ చాటింగ్‌లలో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దని పోలీసులు మహిళలను హెచ్చరించారు. ఈ సైబర్ నేరంపై అప్రమత్తంగా ఉండాలి.

రూపం కన్నా..గుణం ముఖ్యమని మన పెద్దలు చెబుతారు. కానీ ప్రస్తుత కాలంలో ఇది రివర్స్‌ అయిందా అనిపిస్తోంది. గుణం కన్నా రూపానికే ఎక్కువ విలువిస్తున్నారు కొందరు. అలా కొందరు అమాయకులు మోసగాళ్ల చేతిలో బలైపోతున్నారు. అందాన్ని ఎరగావేసి, అమ్మాయిలను ట్రాప్‌లోకి దించి న్యూడ్‌ కాల్స్‌ చేసి.. ఆ తర్వాత, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఓ యువకుడిని ఏలూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏలూరు గ్జేవియర్ నగర్ కు చెందిన వెంపాటి జస్విన్ స్మార్ట్ గా అందంగా ఉంటాడు.. క్రికెట్ ఆడటంలోనూ మంచి నైపుణ్యం ఉన్నవాడు.. ఈ రెండిటినే పెట్టుబడిగా పెట్టి అమాయక యువతులను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వారి వద్ద నుంచి డబ్బు గుంజాలని చూసాడు. తన అందాన్ని ప్రదర్శస్తూ.. అమాయకత్వాన్ని నటిస్తూ.. అమ్మాయిలతో అందంగా మాట్లాడేవాడు. వాళ్లు అతడిని పూర్తిగా నమ్మారని నిర్ధారించుకున్న తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ మెల్లగా యువతులను ఏకాంతంగా మాట్లాడేందుకు ప్రేరేపించేవాడు. చాటింగ్‌ చేస్తూ వారి న్యూడ్‌ వీడియోకాల్స్‌ను స్క్రీన్ రికార్డు చేసేవాడు. అలా రికార్డు చేసిన అశ్లీల వీడియోలను అడ్డం పెట్టుకుని బాధితులను బ్లాక్ మెయిల్ చేసి, భారీగా డబ్బులు డిమాండ్ చేసేవాడు. జస్విన్ చేతిలో మోసపోయిన బాధితులలో బాలింత మహిళలు కూడా ఉండడం ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. ఈ తరహా వేధింపులకు గురైన ఓ బాధితురాలు ధైర్యం చేసి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిపై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం వెంపాటి జస్విన్‌ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ సందర్భంగా డీఎస్పీ .. “నిందితుడు జస్విన్, క్రికెట్ ప్లేయర్. సోషల్ మీడియాలో అమ్మాయిలను పరిచయం చేసుకుని, వారితో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో ఛాటింగ్ చేసే మహిళలు, యువతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆన్‌లైన్ సంభాషణల్లో హద్దులు మీరితే జీవితమే తలకిందులు అయ్యే ప్రమాదం ఉందని గట్టిగా హెచ్చరించారు. అపరిచితులు లేదా పరిచయం ఉన్న వ్యక్తులతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత విషయాలు పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీమిండియా అండర్-19 జట్టులో హైదరాబాదీకి ఛాన్స్‌

రూటు మార్చిన చైన్ స్నాచర్లు.. డైరెక్ట్ గా ఇంట్లోకి చొరబడుతోన్న గొలుసు దొంగలు

అయ్యో.. ఆమె ఏం పాపం చేసిందిరా.. అలా చంపేశారు

జూపార్క్‌లో దారుణం.. దుప్పులను చంపేసిన కుక్కలు

కళ్యాణకట్టలో ఉద్యోగాలంటూ బురిడీ కొట్టించిన లేడీ కిలాడీ

Published on: Nov 15, 2025 12:07 PM