Elephant steals woman: గజరాజుతో ఓ మహిళ ఫోటో దిగాలనుకుంది. అనుకున్నదే తడువుగా ఫోటో కోసం దగ్గరగా ఫోజిచ్చింది. అయితే ఆ ఏనుగు మాత్రం ఆ మహిళతో చిలిపిగా ఆడుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట ఆ మహిళ ఏనుగుకు దగ్గరగా వెళ్లింది… ఒక ఫోటో దిగింది.. మరో ఫోటో దిగేందుకు రెడీ అయ్యింది.
ఫోటో దిగుతున్న సమయంలో ఆ మహిళ హ్యాట్‌ను కొట్టేసింది ఏనుగు. ఇది గమనించిన ఏనుగు ఆ హ్యాట్‌ను తిసుకుని నోట్లో దాచేసింది. అంతే మహిళ షాక్.. కొంత సేపు అక్కడే ఉండిపోయింది. కాసేపు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ నిలుచుంది.
ఆ సమయంలో.. దయచేసి నా టోపీని తిరిగి ఇవ్వండి, దయచేసి అని ఆ మహిళ ఏనుగును అభ్యర్థించింది. కొన్ని సెకన్ల తరువాత, సున్నితమైన ఏనుగు దాని నోటి నుండి టోపీని తీసి ఆ మహిలకు తిరిగి ఇస్తుంది. ఈ వీడియోను అమెరికా క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఏనుగు ఒక మహిళతో జోక్ చేసింది. అవి చాలా తెలివైనవి.. అనే క్యాప్షన్ తన పోస్ట్‌కు జోడించాడు.
1. I’m familiar with this place. This is a safari park in Zimbabwe which allows for unethical interactions between humans and elephants.
I’ve talked to Rex about videos like this before and he always says he didn’t know, but how many times can someone claim ignorance? https://t.co/K71jsPvMvA
— Yashar Ali ? (@yashar) February 11, 2021