Elephant Bike: నడిరోడ్డులో పార్కింగ్ చేస్తున్నారా.. గీట్లుంటదీ మరీ..! వైరల్ అవుతున్న ట్రాఫిక్ పోలీసుల పోస్ట్..
రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు పోలీసులు.
రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు పోలీసులు. వాహనదారుల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. ఒక తీరని సమస్య. జరిమానాలు, కఠిన చర్యలు కూడా కొందరిని కట్టడి చేయలేకపోతున్నాయి. ఇటీవల ప్రచారం కోసం సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు పోలీసులసు. అందులో భాగంగానే.. తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకపోతే.. నిబంధనలను ఉల్లంఘిస్తే ఇలాగే జరుగుతుంటుంది అంటూ ఓ సరదా వీడియోను పోస్ట్ చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. నడిరోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న ఓ బైకును.. ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తన్ని పక్కన పడేసింది ఓ ఏనుగు. ఆ సమయంలో పక్కనే రోడ్డుకు కింది భాగంలో మరో రెండు బైకులు ఉన్నా.. ఆ ఏనుగు వాటి జోలికి పోలేదు. దీంతో.. నడిరోడ్డులో పార్కింగ్ చేస్తే ఇలాగే ఉంటుందని, అలా పార్క్ చేయొద్దంటూ సదరు ఐపీఎస్ అధికారిణి సోషల్ మీడియా వేదిక హెచ్చరించారు. ప్రస్తుతం ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఆ ఏనుగు వీడియో కిందటి ఏడాది అక్టోబర్‌లో జరిగింది. కేరళ మలప్పురంలో దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన గజరాజు.. కాసేపు ప్రజలకు పరుగులు పెట్టించింది. ఆ సమయంలోనే జనాలను బెదరగొట్టి.. అలా బైక్‌ను లాగి తన్నింది. చివరకు.. గ్రామస్తులు దానిని ఎలాగోలా అడవిలోకి తరిమేసినట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..