Truck- Elephant: బురదలో కూరుకుపోయిన ట్రక్కు.. నేనున్నానంటూ గజరాజు సాయం.. వీడియో
భూమి మీద అతి పెద్ద జంతువు ఏనుగు.. వీటి జీవన విధానానికి మానవ జీవన విధానానికి చాలా దగ్గర పోలిక ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు చెబుతారు. ఏనుగుకి సంబంధించిన..
భూమి మీద అతి పెద్ద జంతువు ఏనుగు.. వీటి జీవన విధానానికి మానవ జీవన విధానానికి చాలా దగ్గర పోలిక ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు చెబుతారు. ఏనుగుకి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఏనుగు ట్రక్కును నెట్టుతున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ట్రక్కు బురదలో ఇరుక్కుపోయింది. అందులోని వ్యక్తులు దానిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారివల్ల కావడంలేదు. ఇంతలో వారిక ఓ ఏనుగు వచ్చి సహాయం చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు సిక్కు యువకుల బృందం.. అమృత్‌సర్ నుండి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళుతోంది. సిక్కు సంఘానికి చెందిన ఈ బృందం కొలారస్‌లోని భటోవా గ్రామంలో సేవ చేయడానికి వెళ్తుంది. బ్యాచ్‌లోని సభ్యుడు గురుదేవ్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం కావడంతో.. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు బురదగా మారిందని, దీంతో పలు లారీలు బురదలో కూరుకుపోయాయని తెలిపారు. మట్టిలో ఇరుక్కున్న ట్రక్కులను ఎంతో శ్రమించి మూడు ట్రక్కులను బయటకు తీసామని, అందుకు ఏనుగుకు కూడా తమకు సాయం చేసినట్లు తెలిపాఉ. మహారాష్ట్రలోని నాందేడ్‌లో దసరా పండుగ సందర్భంగా నిర్వహించే జాతరలో పాల్గొనేందుకు ఈ బృందం వెళ్తోంది. కాగా వారితో పాటు ఈ ఏనుగు కూడా వచ్చింది. అంతేకాదు వారితోపాటు 60 గుర్రాలు కూడా ఉన్నాయి. సిక్కులు ఇప్పటికీ గుర్రాలు, ఏనుగులను తమ సైన్యంలో భాగంగా భావిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

