Elephant: విశ్వాసం చూపించాలి అంటే జంతువులే అందానికి మరి నిదర్శనం.. తన కేర్ టేకర్‌ని కొట్టాడని ఆ ఏనుగు ఏం చేసిందో చూడండి..
సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయి. అలాగే జూల్లో ఉండే జంతువులు కూడా కొన్ని తమ కేర్ టేకర్స్‌పై అంతే విశ్వాసం ప్రదర్శిస్తాయి. తమ యజమానికి ఏదైనా హానికలుగుతుందని
సాధారణంగా పెంపుడు జంతువులు తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయి. అలాగే జూల్లో ఉండే జంతువులు కూడా కొన్ని తమ కేర్ టేకర్స్‌పై అంతే విశ్వాసం ప్రదర్శిస్తాయి. తమ యజమానికి ఏదైనా హానికలుగుతుందని అవి గ్రహిస్తే తక్షణం స్పందిస్తాయి. అతన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏనుగు కేర్ టేకర్‌గా ఉండే వ్యక్తిని మరో వ్యక్తి ఎందుకో ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. వీరికి కొంచెం దూరంలో ఉన్న ఏనుగు అది గమనించి, తన కేర్‌టేకర్‌ను కాపాడుకోవాలని పరుగెత్తుకుంటూ వచ్చింది. వేగంగా వస్తున్న ఆ ఏనుగుని చూసి కేర్‌టేకర్‌ని కొడుతున్న వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడు. ఏనుగు.. దెబ్బలు తిన్న కేర్‌టేకర్ చుట్టూ తిరుగుతూ యజమానిపై తన ప్రేమని వ్యక్తం చేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పెంపుడు జంతువులు యజమానిని ఇంతలా ఆరాధిస్తాయా అనడానికి ఈ ఒక్క వీడియో చాలు. ఈ వీడియోని ఒక నె టిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. లక్షల మంది ఈ వీడియోను వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. ఆ ఏనుగు విశ్వాసానికి ఫిదా అయిపోతూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!