Elephant vs Rhino: ఏనుగు vs ఖడ్గమృగం.. ఖడ్గమృగాన్ని కంగారెత్తించిన ఏనుగు.. వీడియో.
న్యప్రాణుల్లో ఏనుగును మించిన బలమైన జంతువు లేదు. అడవికి రాజైనా గజరాజుముందు తలొంచాల్సిందే. ఆకారంలో ఏనుగుతో పోటీపడే ఖడ్గమృగం కూడా తక్కువేమీ కాదు కానీ ఏనుగు ఎదురుపడితే తోకముడవాల్సిందే. కానీ, ఓ ఖడ్గ మృగం మాత్రం తగ్గేదేలే.. అంటూ ఏనుగు మీదకు ఒంటి కాలితో లేచింది.
వన్యప్రాణుల్లో ఏనుగును మించిన బలమైన జంతువు లేదు. అడవికి రాజైనా గజరాజుముందు తలొంచాల్సిందే. ఆకారంలో ఏనుగుతో పోటీపడే ఖడ్గమృగం కూడా తక్కువేమీ కాదు కానీ ఏనుగు ఎదురుపడితే తోకముడవాల్సిందే. కానీ, ఓ ఖడ్గ మృగం మాత్రం తగ్గేదేలే.. అంటూ ఏనుగు మీదకు ఒంటి కాలితో లేచింది. ఇంకే ముంది రెండింటి మధ్య భీకరపోరు. కానీ ఏనుగు ముందు ఖడ్గమృగం పప్పులేం ఉడకలేదు. ఏనుగు నిమిషంలోపే మ్యాటర్ ముగించేసింది. ఖడ్గమృగాన్ని వెనక్కి తిరిగి చూడకుండా పరుగెత్తించింది. ఏనుగు దెబ్బకు బిత్తరపోయిన ఖడ్గ మృగం బ్రతుకు జీవుడా అనుకుంటూ పరుగులంకించుకుంది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా ఈ వీడియోని తన ట్విట్టర్ లో ఇటీవలే షేర్ చేశారు. బలవంతుల మధ్య సమరం అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఎక్కడ తీసిందన్న వివరాలు లేవు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజానికి ఈ రెండూ అడవిలో భయంకరమైన జీవులు. ఖడ్గ మృగాలు సహజంగానే బెదిరింపులకు దిగుతాయని, ఏనుగులు మాత్రం తమకు ముప్పు అనిపించేంత వరకు స్పందించవని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ వీడియోను 70 వేలమంది వీక్షించారు. 2 వేలమందికి పైగా లైక్ చేశారు. కామెంట్లు, రీ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
