Free ticket: మీ ఉచిత సర్వీస్‌ నాకు అక్కర్లేదు.. టికెట్‌ కోసం కండక్టర్‌తో బామ్మ ఫైట్‌.. వీడియో

|

Oct 07, 2022 | 9:14 AM

బస్సులో పురుషుల వద్ద టికెట్లు తీసుకుంటున్నాడు కండక్టర్‌. ఇదే సమయంలో తనకూ టికెట్‌ ఇవ్వాలంటూ కండక్టర్‌ వద్దకు వెళ్లి మరీ డబ్బులు ఇవ్వబోయింది వృద్ధురాలు. అయితే..


ప్రభుత్వం మహిళలకోసం ఏర్పాటు చేసిన ఉచిత సర్వీసును కాదని ఓ బామ్మ టికెట్‌ కోసం బస్సు కండక్టర్‌తో పోట్లాడి మరీ టికెట్‌ తీసుకుంది. తమిళనాడులోని కోయంబత్తూర్లో ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలోనే మధుకరాయ్‌ నుంచి పాలథురాయ్‌ వెళ్తున్న ఓ సర్కారీ బస్సులో వృద్ధురాలు ఎక్కింది. బస్సులో పురుషుల వద్ద టికెట్లు తీసుకుంటున్నాడు కండక్టర్‌. ఇదే సమయంలో తనకూ టికెట్‌ ఇవ్వాలంటూ కండక్టర్‌ వద్దకు వెళ్లి మరీ డబ్బులు ఇవ్వబోయింది వృద్ధురాలు. అయితే అందుకు కండక్టర్‌ నిరాకరించాడు. ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉచితంగానే వెళ్లొచ్చని వృద్ధురాలికున్న ప్రత్యేక సదుపాయాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. అయినా.. ఆ బామ్మ వెనక్కు తగ్గలేదు. తాను బస్సులో ఉచితంగా వెళ్లాలనుకోవట్లేదని, టికెట్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో చేసేది లేక డబ్బులు తీసుకుని బామ్మకు టికెట్‌ ఇచ్చాడు కండక్టర్‌. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు, ఐఏఎస్‌ ఆఫీసర్లు, అధికారులు బామ్మ గొప్ప తనాన్ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు సూపర్‌ బామ్మ.. గ్రేట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Published on: Oct 07, 2022 09:14 AM