ఇదేం విచిత్రం.. మండు వేసవి ముందే వచ్చిందా వీడియో

Updated on: Dec 14, 2025 | 1:12 PM

సాధారణంగా వేసవిలో లభించే తాటి ముంజులు శ్రీకాకుళంలో సీజన్ ముందే లభ్యమవుతున్నాయి. డే అండ్ నైట్ జంక్షన్ సమీపంలో స్థానిక కల్లుగీత కార్మిక కుటుంబం వీటిని విక్రయిస్తోంది. ఒక డజన్ ముంజులు 50 నుండి 60 రూపాయలకు అమ్ముడవుతున్నాయి. ఈ అకాల లభ్యత ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సాధారణంగా వేసవిలో ప్రజలకు చల్లదనాన్నిచ్చే తాటి ముంజులు, మామిడి కాయలు వంటివి లభిస్తాయి. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం కాలంకాని కాలంలోనే తాటి ముంజులు దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ్ జంక్షన్ కు వెళ్లే మార్గంలో, పీఎస్ఎన్ స్కూల్ వద్ద ఒక చెట్టు కింద ఈ తాటి ముంజులను విక్రయిస్తున్నారు.
ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన ఒక కల్లుగీత కార్మిక కుటుంబం గత పదిహేను రోజులుగా ప్రతిరోజూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీటిని అమ్ముతోంది. ఈ ముంజులు హైబ్రిడ్ రకాలు కావు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసినవి కావు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, ఎచ్చెర్ల మండలాల పరిధిలోని తాటి చెట్ల నుంచి సేకరించినవే. కొన్ని చెట్లకు సీజన్ ముందే కాత రావడంతో, వాటిని సేకరించి అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నామని విక్రేతలు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో

రైల్వే సంచలన నిర్ణయం వీడియో

మెస్సీ కోసం హనీమూన్‌ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్‌ వీడియో

వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ను మళ్లీ తీసుకురండి వీడియో

Published on: Dec 14, 2025 01:11 PM