డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
దుబాయ్ విమానాశ్రయం పండుగ సీజన్ రద్దీ అంచనాలను సవరించింది. డిసెంబర్ 28వ తేదీ అత్యంత రద్దీగా, 3.12 లక్షల మంది ప్రయాణికులతో చరిత్రలో నిలిచిపోనుంది. డిసెంబర్ నెల మొత్తం రికార్డు స్థాయిలో 87 లక్షల మందికి పైగా ప్రయాణికులతో నిండిపోతుందని అంచనా. క్రిస్మస్, న్యూ ఇయర్ డిమాండ్‌తో అధికారులు ఈ మార్పులు చేశారు.
పండుగ సీజన్ లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల రద్దీపై తన అంచనాలను సవరించింది. కొత్త అంచనాల ప్రకారం ఈ నెల 28వ తేదీ అత్యంత రద్దీగా ఉండే రోజుగా నిలవనుంది. ఆ ఒక్కరోజే దాదాపు 3,12,000 మందికి పైగా ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించనున్నారని అధికారులు తెలిపారు. వాస్తవానికి, డిసెంబర్ 20న అత్యధికంగా 3,09,000 మంది ప్రయాణిస్తారని గతంలో అంచనా వేశారు. అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల మధ్య ప్రయాణ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో అధికారులు తమ అంచనాలను మార్చారు. పండుగ సెలవులను దుబాయ్‌లో గడిపేందుకు వచ్చే అంతర్జాతీయ పర్యాటకులు, ఇక్కడి నుంచి తమ స్వస్థలాలకు వెళ్లే నివాసితులతో విమానాశ్రయం కిటకిటలాడనుంది. డిసెంబర్ నెల మొత్తం దుబాయ్ విమానాశ్రయం చరిత్రలోనే అత్యంత రద్దీ నెలగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. ఈ నెలలో మొత్తం ప్రయాణికుల సంఖ్య 87 లక్షలు దాటుతుందని అంచనా. ప్రయాణికుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని, అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయంగా దుబాయ్ కి పేరుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎంత పెద్ద నేరం జరిగినా పోలీసులకి చెప్పరు !! ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం అమలు
12 ఏళ్లకు మించి బతకడన్నారు… కట్ చేస్తే.. వేలంలో ఆ క్రికెటర్ రూ.25 కోట్ల ధర పలికాడు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో…! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
