తాగుబోతు పెళ్లికొడుకు నిర్వాకం.. అమ్మాయికి బదులు అత్తగారితో !!
సోషల్ మీడియాలో తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. ఇందులో వివాహ వేదికపైన వరుడు, వధువు, పక్కనే వధువు తల్లి నిలబడి ఉన్నారు.
సోషల్ మీడియాలో తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. ఇందులో వివాహ వేదికపైన వరుడు, వధువు, పక్కనే వధువు తల్లి నిలబడి ఉన్నారు. ఇప్పడు వరుడు వధువు మెడలో వరమాల వెయ్యాలి. అయితే అతడు ఫుల్ మద్యం సేవించి ఉన్నట్లున్నాడు.. అతనికి ఎవరు ఎవరో తెలియడంలేదు.. ఈ క్రమంలో వధువు మెడలో వేయాల్సిన వరమాల కాస్తా అత్తగారి మెడలో వేయబోయాడు. సరిగ్గా అప్పుడే అతడి చుట్టు ఉన్న వ్యక్తులు అతన్ని ఆపుతారు. తర్వాత వధువు మెడలో వేయమని చూపిస్తారు. కానీ అతడు ఆ పని కూడా చేయడు. మద్యం మత్తులో వధువు మెడలో మాల వేస్తూనే కింద పడిపోతాడు. ఇది చూసిన వధువు ఆశ్చర్యపోతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోను వీక్షిస్తున్న వేలమంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ తాగుబోతు వ్యక్తికి పెళ్లి అవసరమా అని కొందరు’‘పెళ్లి రోజు కూడా తాగాలా’ అంటూ మరికొందరు మండిపడ్డాడు. చాలామంది పెళ్లికొడుకు తీరుని తప్పుబట్టారు. ఈ పెళ్లి తర్వాత వధువు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి