పొద్దున్నే ఆలయానికి వెళ్లి డోర్ తీసిన అర్చకుడికి షాక్‌.. ఏం జరిగిందంటే..?

Updated on: Jul 23, 2025 | 4:05 PM

ఇటీవల దొంగలు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. చోరీలకు వెళ్లి ఆ ఇళ్లలోనే వంట చేసుకుని తినడం, అదే ఇంట్లో నిద్రపోవడం.. తెల్లారిన తర్వాత పోలీసులు వచ్చి వారిని నిద్రలేపి అరెస్ట్‌ చేయడం లాంటి ఘటనలు తరచూ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో అలాంటి ఘటనే జరిగింది. గుడిలో చోరీకి వెళ్లిన ఓ దొంగ ఆలయం లోపలే నిద్రపోయాడు.

జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నోముండీ పట్టణంలోని కాళీ ఆలయంలో దొంగతనానికి వచ్చిన వీర్ నాయక్ అనే వ్యక్తి ఆలయం వెనుక తలుపు పగులగొట్టి లోపలికి చొరబడ్డాడు. ఆలయంలో ఉన్న అలంకార వస్తువులు, అమ్మవారి ఆభరణాలు, కిరీటం వంటి విలువైన వస్తువులు సంచిలో వేసుకున్న అతడు.. మద్యం మత్తులో మగతగా ఉండటంతో అక్కడే పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం ఆలయ అర్చకుడు వచ్చి చూసే సరికి వీర్ నాయక్ నిద్రలో ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అరెస్ట్ చేశారు. అతను చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ముందు వీర్ నాయక్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్టు విచారణలో వెల్లడైంది. దొంగతనానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో.. తాను నిద్రలోకి ఎలా జారిపోయానో గుర్తు లేదని పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అన్ని లక్షల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌గానే వారి ఆధార్ కార్డులు

నక్క తోక తొక్కడం అంటే ఇదే కాబోలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ

స్కూల్లో మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న చిన్నారి.. అంతలోనే..!

ఇక.. డబ్బు లేకుండానే గ్యాస్ సిలిండర్లు

వర్షాకాలంలో ఈ పండ్లు తిన్నారో.. రోగాలకు రెడ్‌ కార్పెట్‌ పరిచినట్లే..