ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!

Updated on: Jul 07, 2026 | 6:12 PM

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మద్యం మత్తులో ఓ యువకుడు నడిరోడ్డుపై ప్రైవేట్ కాలేజీ బస్సు కిందకు దూరి హంగామా చేయడంతో అరగంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు బయటకు రప్పించే ప్రయత్నాలు విఫలమవడంతో పోలీసులు చేరుకుని అతడిని సురక్షితంగా బయటకు తీసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మద్యం మత్తులో కొందరు చేసే విన్యాసాలు చూసేవారికి నవ్వు తెప్పించినా, ఒక్కోసారి భారీ ట్రాఫిక్ జామ్‌లకు, ప్రాణసంకటాలకు దారితీస్తుంటాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శనివారం సాయంత్రం ఓ మందుబాబు చేసిన హంగామా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఏకంగా నడిరోడ్డుపై వెళ్తున్న బస్సు కిందకు దూరి అతడు చేసిన నానాయాగీతో అరగంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. పద్మనాభపురం కాలనీకి చెందిన సోమేలు అనే యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి పాత జాతీయ రహదారిని దాటుతున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఒక ప్రైవేట్ కాలేజీ బస్సు డ్రైవర్‌తో అతడికి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అంతే.. మద్యం మత్తులో ఊగిపోతూ “నాకు అన్యాయం జరిగింది” అని కేకలు వేస్తూ, ఏకంగా ఆ కాలేజీ బస్సు కిందకు దూరి పడుకున్నాడు. ఇది చూసి షాకైన స్థానికులు, వాహనదారులు అతడిని బయటకు రప్పించేందుకు ఎంత ప్రయత్నించినా ససేమిరా అన్నాడు. చివరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఎంతో శ్రమించి అతడికి నచ్చజెప్పి బస్సు కింద నుండి బయటకు లాగారు. రోడ్డుపైకి వచ్చాక కూడా ఆ మందుబాబు పోలీసుల ముందే చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ నానా హంగామా సృష్టించాడు. దీంతో పోలీసులు అతడిని నియంత్రించి స్టేషన్‌కు తరలించడంతో వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి

గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

Maa Inti Bangaram: ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!

నీ ‘సర్‌’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా

నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్‌, ఎగ్స్‌ ధర

Loading...
Unable to load recommendations.
Follow Us