Drugs case: గోవా కేంద్రంగా డ్రగ్స్ సప్లై కింగ్‌పిన్ డిసౌజా అరెస్ట్.. కాంటాక్ట్ లిస్టులో 168 హైదరాబాదీ ప్రముఖులు.!

|

Oct 01, 2022 | 8:34 PM

గోవా డ్రగ్స్ కింగ్ పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్‌ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఆగష్టు 16న బాబు అలియాస్ కాళీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను నుంచి కీలక సమాచారం రాబట్టారు.


గోవా డ్రగ్స్ కింగ్ పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్‌ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఆగష్టు 16న బాబు అలియాస్ కాళీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఇంటరాగేషన్‌లో కాళీ చెప్పిన ఏడుగురి డ్రగ్స్ స్మగ్లర్ల గురించి అన్వేషించారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న డ్రగ్ కింగ్ స్టీఫెన్ డిసౌజాను గోవా పోలీసులు సహకారంతో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్టీఫెన్ దగ్గర దేశ వ్యాప్తంగా 600మంది డ్రగ్స్ కస్టమర్లు లిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. వారిలో హైదరాబాద్ కు చెందిన 168 మంది పేర్లు ఉన్నట్లు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తెలిపింది.గోవా కేంద్రంగా హిల్ టాప్ రెస్టారెంట్‌లో డ్రగ్స్ డెన్ ఉన్నట్లు గుర్తించారు. 1983 నుండి నడుస్తున్న హిల్ టాప్ పబ్బులో ప్రతి శుక్రవారం స్పెషల్ పార్టీలు.. ట్రాన్స్ మ్యూజిక్ పార్టీలు జరుగుతాయన్నట్లు తేలింది. పక్కా సమాచారంతో స్టీవ్‌ను అరెస్ట్ చేసి గోవా కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు చెప్పారు ఈస్ట్ జోన్ డీసీపీ. కాగా హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, బెంగుళూరు, చెన్నైకి కూడా స్టీఫెన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నార్కొటిక్స్ వింగ్ ఇదివరకే గుర్తించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Follow us on