Wayanad landslides: డ్రోన్‌ రాడార్‌తో మృత్యుంజయుల కోసం వెతుకులాట.!

|

Aug 05, 2024 | 9:04 AM

వయనాడ్‌లోకొండచరియలు విరిగిపడిన ఘటనలో కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిలో ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలను తీవ్రం చేశారు. మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్‌ను ఉపయోగిస్తున్నారు. చిక్కుకున్నవారిలో ప్రాణాలతో బయటపడినవారి కోసం సహాయక చర్యలను ఉద్ధృతం చేశారు.

వయనాడ్‌లోకొండచరియలు విరిగిపడిన ఘటనలో కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిలో ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలను తీవ్రం చేశారు. మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్‌ను ఉపయోగిస్తున్నారు. చిక్కుకున్నవారిలో ప్రాణాలతో బయటపడినవారి కోసం సహాయక చర్యలను ఉద్ధృతం చేశారు. స్థానిక పోలీసులు, ఈతలో నిష్ణాతులైన స్థానికులు ఈ సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మరోపక్క 25 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు కలిసికట్టుగా గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో ముగ్గురు స్థానికులు, ఒక అటవీశాఖ ఉద్యోగి భాగం అయ్యారు. వయనాడ్‌లో విపత్తు సంభవించిన ప్రాంతాన్ని ఆరు జోన్లుగా విభజించి, 40 బృందాలు గాలింపుచర్యలు చేపడుతున్నాయి. ఈ విషాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. మృతుల సంఖ్య 300 దాటినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దాదాపు 300 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on