స్నేహితుడికోసం అల్లాడిన శునకం !! నెటిజన్లను ఆకట్టుకుంటున్న హార్ట్‌టచ్చింగ్‌ వీడియో

|

Jul 10, 2023 | 8:25 PM

స్నేహితులను మించిన ఆప్తులు ఉండరు అంటారు. ఎందుకంటే స్నేహం కోసం మిత్రులు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఆపదలో ఉన్న మిత్రులను ఆదుకోడానికి ఎంతగానో తాపత్రయపడతారు. అదే నిజమైన స్నేహం. ఇది కేవలం మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ కనిపిస్తుంది.

స్నేహితులను మించిన ఆప్తులు ఉండరు అంటారు. ఎందుకంటే స్నేహం కోసం మిత్రులు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఆపదలో ఉన్న మిత్రులను ఆదుకోడానికి ఎంతగానో తాపత్రయపడతారు. అదే నిజమైన స్నేహం. ఇది కేవలం మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ కనిపిస్తుంది. తాజాగా ఓ శునకం ఆపదలో చిక్కుకున్న తన మిత్ర శునకం కోసం అల్లాడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు కుక్కలు సరదాగా ఆడుకుంటున్నాయి. అటూ ఇటూ పరిగెడుతున్నాయి. అలా వెళ్తున్న వాటిలో ఓ కుక్క గోడ పక్కన ఉన్న ఒక మ్యాన్‌హోల్ లాంటిదానిలో పడిపోయింది. దానిపైన సరిగా లేకపోవడంతో ఆ శునకం దానిలో పడిపోయింది. బయటకు రాలేక అందులోనే ఉండిపోయింది. దీంతో రెండో కుక్కకు ఏం చేయాలో తోచలేదు. స్నేహితుడి పరిస్థితి చూసి అల్లాడిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్లాస్‌ రూమ్‌లో అమ్మాయిలను చొక్కాలు విప్పమన్న ప్రొఫెసర్‌ !!

శివాలయంలో అద్భుతం.. పాలు తాగుతున్న శివుడు,నంది..