Dog: ఎయిర్‌పోర్టు అధికారుల్ని పరిగెత్తించిన శునకం.. వీడియో చూడటానికి ఫన్నీగా ఉన్నా.. అధికారులు మాత్రం..
మెక్సికోలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో ఒక శునకం అధికారుల్ని పరుగులు పెట్టించింది. విమానాశ్రయం రన్‌వే అంతా ముప్పుతిప్పలు పెట్టింది. కాస్టిల్లా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కను తీసుకొచ్చింది.
మెక్సికోలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో ఒక శునకం అధికారుల్ని పరుగులు పెట్టించింది. విమానాశ్రయం రన్‌వే అంతా ముప్పుతిప్పలు పెట్టింది. కాస్టిల్లా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కను తీసుకొచ్చింది. సరిగ్గా బోర్డిండ్ సమయానికి కుక్కకు కట్టిన బెల్ట్ తెగింది. దాంతో ఆ కుక్క యాజమాని నుంచి తప్పించుకొని విమానం నుంచి బయటకు వచ్చేసింది. విమానం కింద నుంచి రన్ వే మొత్తం కలియ తిరిగింది. ఉరుకులు పరుగులు తీసింది. దీంతో కుక్క వెంబడి అధికారులు పరుగులు తీశారు. అయినా ఎంతకూ అది దొరకలేదు. అయితే ఆ సమయంలో రన్‌వే పైకి వాహనాలు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి తిరిగి తిరిగి అలసిపోయిన సిబ్బంది ఎలాగోలా ఆ కుక్కను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే 2 లక్షల మంది వీక్షించారు. నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అధికారులకు శునకం మంచి వ్యాయామం చేయించిందని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..
Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!