పాస్‌పోర్టును నమిలేసిన కుక్క.. చిక్కుల్లో వరుడు !!

|

Aug 24, 2023 | 9:58 AM

అమెరికాలో ఓ శునకం చేసిన పనికి ఏకంగా పెళ్లి ఆగిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. పెళ్లి చేసుకునేందుకు వేరే దేశానికి వెళ్లాలనుకున్న వరుడి పాస్‌పోర్టును పెంపుడు కుక్క నమిలేసింది. దీంతో ఆ వ్యక్తి లబోదిబోమంటున్నాడు. వాషింగ్టన్‌కి చెందిన డొనాటో ఫ్రాట్టరోలిస్ కి మాగ్దా మజ్రీస్ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. వారు ఇటలీ లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వేడుక ఏర్పాట్లలో భాగంగా బయటకు వెళ్లారు. ఈ సమయంలో డొనాటో పెంపుడు కుక్క అతడి పాస్‌పోర్ట్‌ను నమిలేసింది.

అమెరికాలో ఓ శునకం చేసిన పనికి ఏకంగా పెళ్లి ఆగిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. పెళ్లి చేసుకునేందుకు వేరే దేశానికి వెళ్లాలనుకున్న వరుడి పాస్‌పోర్టును పెంపుడు కుక్క నమిలేసింది. దీంతో ఆ వ్యక్తి లబోదిబోమంటున్నాడు. వాషింగ్టన్‌కి చెందిన డొనాటో ఫ్రాట్టరోలిస్ కి మాగ్దా మజ్రీస్ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. వారు ఇటలీ లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వేడుక ఏర్పాట్లలో భాగంగా బయటకు వెళ్లారు. ఈ సమయంలో డొనాటో పెంపుడు కుక్క అతడి పాస్‌పోర్ట్‌ను నమిలేసింది. ఇంటికి చేరుకున్న తర్వాత కుక్క చేసిన పనిని చూసి షాక్‌ తిన్నారు. వరుడు స్థానిక అధికారుల దగ్గరికి పరుగులు పెట్టాడు. ప్రత్యామ్నాయం కోసం సహాయం కోరాడు. ఆగస్టు 31న ఇటలీలో తన వివాహం జరగనుందని ఇలాంటి సమయంలో తమ శునకం ఈ పని చేసిందని వాపోయాడు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని లేకపోతే తను లేకుండానే తనకు కాబోయే భార్యతో సహా బంధువులంతా ఇటలీకి వెళ్లిపోతారని తను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది అని డొనాటో తెలిపారు. అదృష్టవశాత్తూ, కాంగ్రెస్‌ సభ్యుడు ఒకరు డొనాటో సమస్యపై స్పందించారు. వీలైనంత త్వరలో ఆయన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషి దోసిట నీళ్లు తాగిన చింపాంజీ .. తర్వాత ఏం చేసిందంటే ??

13 ఏళ్లుగా సుద్ద ముక్కలే ఆమెకు ఆహారం.. అన్నం ముట్టదు !!

కుక్కల కోసం హై క్లాస్ ఓల్జేజ్ హోం !! సంగీతం వినడం కోసం మ్యూజిక్‌ సిస్టమ్‌ను ఏర్పాటు

Chandrayaan-3: మూన్ మిష‌న్‌పై విక్రమ్‌ సారాభాయ్ వారసుని మాట..

Jailer: 566కోట్లు ఏంది సామి! హిస్టరీ క్రియేట్ చేసిన రజినీ