యజమాని మృతిని జీర్ణించుకోలేని శునకం.. నెలరోజుల్లోనే

|

Oct 19, 2024 | 2:04 PM

శునకం.. విశ్వాసానికి దీనిని మించిన జంతువు మరొకటి ఉండదు. పట్టెడన్నం పెట్టే యజమాని పట్ల కుక్క ఆ జన్మాంతం విశ్వాసంగా ఉంటుంది. ఆ ఇంటికి, కుటుంబానికి రక్షణగా ఉంటుంది. యజమాని రక్షణకోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. ఇంటినుంచి బయటకు వెళ్లిన యజమాని ఇంటికి తిరిగి వచ్చే వరకూ గుమ్మం వద్దే ఎదురు చూస్తుంటుంది. యజమాని రాగానే ఆప్యాయంగా ఎదురెళ్లి ఆహ్వానిస్తుంది. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.

అలాంటి యజమాని కనిపించకుండా పోతే ఆ మూగజీవి తన బాధ ఎవరికీ చెప్పుకోలేదు. తనలో తానే మూగగా రోదిస్తుంది. అలాంటి ఘటనే జరిగింది కరీంనగర్‌ జిల్లాలో. తన యజమాని మరణాన్ని తట్టుకోలేని ఆ శునకం చివరికి ప్రాణాలే వదిలేసింది. యజమాని మరణాన్ని తట్టుకోలేకపోయింది. నెల రోజులగా ఫోటో ఎదుట ఆవేదనతో కూర్చింది. తిండికూడా మానేసింది. చివరకు యజమాని లేనిచోటు తానుండలేనని తనుకూడా అతనివద్దకే వెళ్లిపోయింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటనీరు పెటపెట్టించింది. జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి నెలరోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. తనను అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క యజమాని కనిపించకపోవడంతో తిండి తినడం మానేసి యజమాని రాకకోసం ఎదురుచూసింది. ఎంతకీ రాకపోవడంతో అతని ఫోటోవద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లిపోయావు అన్నట్టుగా దీనంగా చూస్తూ వచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారి దోపిడి.. ఇలా కూడా చేస్తారు.. జాగ్రత్త

రైలు కిటికీ నుంచి జారిపడ్డ చిన్నారి.. ఎక్కడ దొరికిందో తెలుసా ??

మందుబాబు నిర్వాకం.. ఏం జరిగిందో చూడండి

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. క్షణం ఆలస్యం అయ్యుంటే.. రైలు బ్లాస్ట్‌ అయిపోయేదే !!

Adah Sharma: సుశాంత్ ఉరేసుకున్న ఇంటికి షిఫ్ట్ అయిన అదా శర్మ