వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్‌ రిపోర్ట్‌ చూసి డాక్టర్స్‌ షాక్‌!

Updated on: May 23, 2026 | 12:06 PM

విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి 50 ఏళ్ల వ్యక్తి మూత్రాశయం నుంచి కోడిగుడ్డు పరిమాణంలో ఉన్న ఐదు భారీ రాళ్లను తొలగించారు. పొత్తికడుపు నొప్పి, మూత్రవిసర్జన సమస్యలతో బాధపడుతున్న రోగికి అత్యవసర సర్జరీ నిర్వహించి విజయవంతంగా చికిత్స అందించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.

విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన 50 ఏళ్ల డి.రామకృష్ణ అనే వ్యక్తి గత కొంతకాలంగా పొత్తికడుపులో నొప్పి, మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో, మే 4న షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. వైద్యులు రామకృష్ణకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా, మూత్రాశయంలో ఏకంగా కోడిగుడ్డు పరిమాణంలో పెద్ద పెద్ద రాళ్లు ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు. పరిస్థితి తీవ్రతను బట్టి లాప్రోస్కోపిక్ యూరో అంకాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ మహేశ్వరరెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం అతనికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించింది. సర్జరీ ద్వారా రామకృష్ణ మూత్రాశయం నుండి కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఐదు పెద్ద రాళ్లను వైద్యులు విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా డాక్టర్ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ… మూత్రం సక్రమంగా విసర్జించబడక లోపలే నిల్వ ఉండిపోవడం, మూత్రనాళాల్లో అడ్డంకులు, ఇన్‌ఫెక్షన్ల కారణంగానే మూత్రాశయంలో ఇలాంటి పెద్ద రాళ్లు ఏర్పడతాయని వివరించారు. మూత్రంలో రక్తం పడడం, పొత్తికడుపులో విపరీతమైన నొప్పి, తరచూ ఇన్‌ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత వీర బాదుడే!

అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!

పూట గడవడానికి అప్పులు! అమెరికన్ల కష్టాలపై సర్వే!

ఏటీఎం నుంచే పీఎఫ్ డబ్బులు.. కొత్త రూల్ చూశారా?

జూన్ 8న ‘చేప ప్రసాదం’ ఈ ఏడాది రాత్రివేళ పంపిణీ

Follow Us