రోగులను గాలికి వదిలేసి.. ఈ డాక్టర్‌ చేసిన పనికి.. అస్సలు..

Updated on: Jul 03, 2025 | 6:33 PM

వైద్యులపై ఎంతో నమ్మకంతో.. తమ ఆరోగ్యాన్ని బాగుచేస్తారనే భరోసాతో రోగులు ఆస్పత్రులకు వెళ్తారు. కానీ కొందరు వైద్యులు తమ నిర్లక్ష్య ధోరణితో రోగులను పట్టించుకోరు. అసలే అనారోగ్యం.. మరోపక్క గంటలు తరబడి లైన్లో నిలబడాలి.. అది సరిపోదన్నట్టు వైద్యులు కూడా రోగుల బాధను అర్ధం చేసుకోకుండా వారిని నిర్లక్ష్యం చేయడం దారుణం.

తాజాగా అలాంటి ఘటనే నాగర్‌ కర్నూలు జిల్లాలో జరిగింది. రోగుల కంటే గేమ్సే తనకు ముఖ్యమన్నట్టు మొబైల్‌ గేమ్స్‌లో మునిగిపోయింది ఓ డాక్టర్‌. పెద్ద ఎత్తున రోగులు వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చినా.. వారిని పట్టించుకోకుండా ఓ లేడీ డాక్టర్ తన స్మార్ట్ ఫోన్లో గేమ్ ఆడుతూ లీనమైపోయింది. ఇతర రోగులు క్యూ లైన్ లో ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డు ద్వారా రోగులను బయటే నిలిపి తాను మాత్రం కాలక్షేపం చేస్తూ ఉండిపోయింది. కింది స్థాయి వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా తనకేమి పట్టనట్లు వ్యవహరించడంతో పక్కనే ఉన్న రోగులు అవాక్కయ్యారు. ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్‌కుమార్ తనిఖీ చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపంతోనే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రోగులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ రఘు విచారణకు ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ అయేషా సమకు మెమో జారీ చేశారు. విధి నిర్వహణలో ఉండగానే.. సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడటంపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఇంకా మూడు రోజులే’.. వంగా వాణి నిజమైతే ?? బాబోయ్

వేసవిలో వెంకన్న హుండీకి రికార్డు ఆదాయం

పెళ్లైన పక్షం రోజులకే.. అత్తతో అల్లుడు జంప్.. అదే కదా మ్యాజిక్

టూ వీలర్‌ కొంటున్నారా.. ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే

జాలర్ల వలలో చిక్కిన అసలు సిసలైన చేప.. అబ్బా అదృష్టం ఆంటే ఇతనిదే