Doctor: వీడేం డాక్టర్ బాబు..! బిడ్డను తీసి.. కడుపులో కత్తెర మరిచిన డాక్టర్..!
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిందన్న చందంగా మారింది ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు వైద్యుల పరిస్థితి. పెద్దపల్లిజిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు ఐదేళ్ల క్రితం
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిందన్న చందంగా మారింది ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు వైద్యుల పరిస్థితి. పెద్దపల్లిజిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు ఐదేళ్ల క్రితం ఆపరేషన్ చేసింది ఓ లేడీ డాక్టర్. తర్వాత ప్రసూతి మహిళను ఇంటికి పంపించారు. అప్పటి నుంచి సదరు మహిళ కడుపు నొప్పుతో బాధ పడుతూ ఉంది. నొప్పి ఎక్కువ కావడంతో తాజాగా హైదరాబాద్‌లోని పరీక్షలు చేయించారు కుటుంబ సభ్యులు. టెస్టుల్లో ఏమి తెలియకపోవడంతో ఎక్స్‌రేలు తీశారు. దీంతో గోదావరిఖనిలోని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ వెలగబెట్టిన ఘనకార్యం బయటపడింది. ఎక్స్‌రేలో కడుపులో కత్తెర ఉన్నట్లుగా తేలింది. విషయం తెలుసుకున్న మహిళ, ఆమె బంధువులు షాక్ అయ్యారు. ఆపరేషన్ చేసిన లేడీ డాక్టర్‌ని నిలదీశారు. చేసిన తప్పును అంగీకరించింది ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్. అంతేకాదు కత్తెర తీయడానికి చేసే సర్జరీ ఖర్చు తానే భరిస్తానని రాజీ కుదుర్చుకుంది. దీంతో ట్రీట్‌మెంట్ కోసం ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!