Old Gyms: 1940లో జిమ్ లు ఎలా ఉండేవో తెలుసా.. ఆశ్చర్యం కలిగిస్తున్న వీడియో..

|

Aug 06, 2022 | 9:41 AM

గతం ఎప్పుడూ ఘనం అన్నాడో సినీ కవి. ముఖ్యంగా పూర్వకాలంలో మనుషులు ఎలా ఆరోగ్యంగా జీవించేవారు.. ఏమి తినేవారు.. తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలోనూ ఉంటుంది.


గతం ఎప్పుడూ ఘనం అన్నాడో సినీ కవి. ముఖ్యంగా పూర్వకాలంలో మనుషులు ఎలా ఆరోగ్యంగా జీవించేవారు.. ఏమి తినేవారు.. తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలోనూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో అయితే ఆరోగ్యంగా, పిట్‌గా ఉండడం కోసం జిమ్, యోగ వంటివాటిని ఆశ్రయిస్తున్నారు. అందుకు రకరకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.. మరి పూర్వ కాలంలో ఇలాంటి యంత్రాలు ఉండవు కదా.. మరి అప్పుడు జిమ్ ఎలా చేసేవారో తెలుసా.. 1940 లలో మహిళలు జిమ్‌లో శరీరాన్ని ఏ విధంగా ఫిట్ గా ఉంచుకునేవారో తెలిపే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో జిమ్‌లో కొన్ని మెషీన్లు ఉన్నాయి. అందులో తమ ఫిట్‌నెస్‌ను పెంచుకోడానికి ఆ మెషీన్లను ఉపయోగిస్తున్న మహిళలు కనిపిస్తారు. ఇవి చాలా ప్రత్యేకమైన యంత్రాలు.. వీటి లోపల మహిళలు నిలబడితే చాలు.. ఈ పరికరాలు వారి పాదాల నుండి పొట్ట వరకు కదులుతూ మర్దనా చేస్తూ ఉంటాయి. అయితే ఇంత ఆధునిక విజ్ఞానం, శాస్త్ర సాంకేతికత అందుబాటులో లేని అప్పట్లో కూడా శారీరం ఫిట్ గా ఉంచుకోవడానికి.. తమ ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఆటోమేటిక్ మెషీన్లు వాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రకరకాల మెషీన్లతో మహిళలు జిమ్ చేస్తున్న తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అప్పటి పాత వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియో ట్విట్టర్‌లో లాస్ట్ ఇన్ హిస్టరీ అనే ID పేరుతో షేర్ చేసారు . ఇది 1940 నాటి మహిళల జిమ్ అని క్యాప్షన్‌లో చెప్పారు. ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. వందలాది మంది లైక్ చేసారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..