డీమ్యాట్ ఖాతాలో రూ. 2,817 కోట్ల సంపద.. కాసేపటికే అంకెలన్నీ మాయమై
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి తలరాత రాత్రికి రాత్రే మారిపోయింది. నోటరీగా పనిచేస్తూనే..ప్రైవేటు స్కూలు నడుపుతున్న వినోద్ డోంగ్లే డీమ్యాట్ ఖాతాలోని ఓ కంపెనీ షేర్ల విలువ కోట్లకు పెరిగిపోయింది. మొత్తంగా వెయ్యికి పైగా షేర్లు ఉండడంతో ఆయన సంపద ఏకంగా రూ.2,817 కోట్లకు చేరినట్లు చూపించింది. దీంతో తన తలరాత మారిపోయిందని, ప్రపంచంలోని లాటరీలన్నీ ఒకేసారి గెల్చానని భావించినట్లు డోంగ్లే చెప్పారు.
అయితే, ఈ ఆనందం కాసేపటికే ఆవిరైపోయింది. అప్పటి వరకు ఒక్కో షేరు రూ.2.14 కోట్లు చొప్పున 1,312 షేర్ల విలువ రూ.2,817 కోట్లుగా చూపించగా.. కాసేపటికే ఆ అంకెలన్నీ మాయమై పాత విలువనే చూపించాయి. ఒక్కో షేరు 63 పైసల చొప్పున రూ 826.56 పైసలుగా చూపించింది. హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్ల విషయంలో వినోద్ డోంగ్లేకు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. కాసేపే అయినా అంకెల్లో తను బిలియనీర్ ను అయ్యానని వినోద్ డోంగ్లే సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ గది ఇదే.. నెట్టింట ఫుల్ ట్రెండ్
