రెండు చేతులూ లేకపోయినా బైక్‌పై దూసుకెళ్లిన..
శారీరకంగా దివ్యాంగుడైన ఓ వ్యక్తి రెండు చేతులు లేకపోయినా, అపారమైన ధైర్యంతో కాళ్లతో బైక్ నడుపుతూ దూసుకెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. అసాధారణమైన సంకల్పబలం, అద్భుతమైన నైపుణ్యంతో అతను బైక్‌ను బ్యాలెన్స్ చేస్తున్న తీరు నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన ఆత్మవిశ్వాసం, స్ఫూర్తికి నిదర్శనం. అయితే, తగిన జాగ్రత్తలు లేకుండా ఇలాంటివి ప్రయత్నించకూడదు.
ప్రపంచంలో కొంతమంది శారీరకంగా దివ్యాంగులు అయినా.. వారికి అపారమైన ధైర్యం, దృఢ సంకల్పం ఉంటుంది. ఆ సంకల్ప బలమే వారిని విజయపథంలో నడిపిస్తుంది. తాము దివ్యాంగులం అన్న భావన లేకుండా ధైర్యంగా అడుగులు వేసేలా చేస్తుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ వ్యక్తి కి రెండు చేతులు లేవు. అయినా కాళ్లతో ఎంతో కాన్ఫిడెంట్‌గా బైక్ నడుపుతూ ఇతర వాహనదారుల్లాగే రోడ్డుమీద దూసుకెళ్తున్నాడు. కాళ్లతో అతను బైక్‌ను బ్యాలెన్స్ చేస్తున్న తీరు చూసి అంతా ఆశ్చర్యపోయారు. వీడియోలో బుల్లెట్ వేగంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి రెండు చేతులు లేవని స్పష్టంగా తెలుస్తోంది. అయినా అతను పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో బైక్‌ను స్పీడ్‌గా నడుపుతున్నాడు. ఈ షాకింగ్ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అతనికి చేతులు లేవు.. అయినా అతను బుల్లెట్ వేగంతో బైక్ నడుపుతున్నాడు. ఇది అసాధారణ ప్రతిభ, ధైర్యానికి అరుదైన ఉదాహరణ. మీరు ఎప్పుడైనా ఇలాంటిది చూశారా? అంటూ ప్రశ్నించాడు. వీడియో చూసిన నెటిజన్లు అతని ఆత్మవిశ్వాసానికి, నైపుణ్యానికి ఫిదా అవుతున్నారు. కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకున్న తరువాత మాత్రమే ఇలా బైక్ ను నడపడం మంచిది. ప్రావీణ్యం లేకుండా ఇలాంటి పనులు చేయకూడదు అని గమనించండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు కదిలిపోతోంది.. నా పైసలు ఇచ్చెయ్ అన్నా.. ప్లీజ్
వేగంగా దూసుకెళ్తున్న కారు.. సైడ్ మిర్రర్ నుంచి సైలెంట్‌గా వచ్చిన పాము.. కట్ చేస్తే
చిన్న రక్త పరీక్షతో క్యాన్సర్ ముప్పు గుర్తింపు
అది రైలు బ్రో.. మన ఇల్లు కాదు.. అలా ఎలా చేస్తావ్ ??
ఈమె టెక్నిక్ చూస్తే.. ప్రతి ఇంట్లో ఆడోళ్లు ఇలానే చేస్తారేమో.. ఐడియాకి సెల్యూట్ చెయ్యాల్సిందే
