వేల కోట్ల వ్యాపారాలకు వారసుడు.. అయినా రాత్రిళ్లు క్యాబ్ నడుపుతూ
జాన్, 86 ఏళ్ల భారతీయ మూలాలున్న ఫిజి బిలియనీర్, రూ.1500 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. పదేళ్లుగా రాత్రిపూట ఉబెర్ క్యాబ్ నడుపుతూ సంపాదించిన మొత్తాన్ని ఏటా 24 మంది పేద భారతీయ బాలికల విద్యకు దానం చేస్తున్నారు. తన కష్టం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఇలా కేటాయిస్తూ, బాలికలు ఉన్నత విద్య పొందాలని ఆయన ఆశిస్తున్నారు. ఇది ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.
వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన ఓ వ్యక్తి, స్వయంగా క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నారు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద బాలికల చదువుకోసం దానం చేస్తున్నారు.పేరు జాన్. వయసు 86 ఏళ్లు. ఫిజీ దేశంలోని సువా నగరంలో నివసించే జాన్ భారతీయ మూలాలున్న వ్యక్తి. జాన్ తండ్రి 1929లో భారత్ నుంచి ఫిజీకి వలస వెళ్లారు. అప్పట్లో అతను కేవలం 5 పౌండ్లతో, అంటే నాడు ఇండియన్ కరెన్సీలో 65 రూపాయలతో ఫీజీలో ప్రారంభించిన వ్యాపారం దిన దినాభివృద్ధి చెందింది. ఇప్పుడు13 జ్యువెలరీ షాపులు, 6 రెస్టారెంట్లు, 4 సూపర్‌మార్కెట్లు, ఒక లోకల్ న్యూస్‌పేపర్ వరకు విస్తరించిన జాన్ వ్యాపారం 1,500 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. కోట్లాది వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైనప్పటికీ పదేళ్ళ నుంచి అతను రాత్రిపూట ఉబెర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. డ్రైవింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రతీ సంవత్సరం 24 మంది భారతీయ పేద బాలికల చదువుకోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇది వాళ్ల స్కూల్ ఫీజు, హయ్యర్ ఎడ్యుకేషన్ లేదా వొకేషనల్ ట్రైనింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది అన్నారు బిలియనీర్ క్యాబ్ డ్రైవర్ జాన్. అయితే తన సొంత కష్టం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఇలా కేటాయిస్తారు తప్ప తనకున్న ఇతర వ్యాపారాల నుంచి వచ్చే ప్రాఫిట్‌ను దానం లేదా సహాయం చేయడానికి ఉపయోగించనని కూడా అతను తెలిపారు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, వారికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి సెటిల్ చేశానని చెబుతున్న జాన్, తన కూతుర్ల లాగే పేద బాలికల ఎదగాలనే ఆకాంక్షతో సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్టోరీకి సంబంధించిన పోస్ట్‌ను భారతీయ వ్యాపారవేత్త నవ్ షా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ‘ట్రూ లెజెండ్’ ‘ఇన్‌స్పిరేషన్’ అని నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు. నెలకు లక్ష రూపాయల ఆదాయం వస్తేనే నా అంతటి వాళ్లు లేరని ఫీలవుతుంటారు కొందరు. చిన్న చిన్న పనులు చేయడానికి, తమకంటే తక్కువ ఆదాయం వచ్చే వారితో స్నేహం చేయడానికి నామోషీగా ఫీలవుతుంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగించే వార్త ఇది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండు చేతులూ లేకపోయినా బైక్‌పై దూసుకెళ్లిన..
రైలు కదిలిపోతోంది.. నా పైసలు ఇచ్చెయ్ అన్నా.. ప్లీజ్
వేగంగా దూసుకెళ్తున్న కారు.. సైడ్ మిర్రర్ నుంచి సైలెంట్‌గా వచ్చిన పాము.. కట్ చేస్తే
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

