Nellore: పుట్ట నుంచి బయటకు వచ్చిన నాగుపాము నేరుగా వెళ్లి ఏం చేసిందో చూడండి..
నెల్లూరు జిల్లాలో అద్భుతం ఘటన వెలుగుచూసింది. చెర్లోపల్లి రైల్వేగేటు దగ్గర ఉన్న విశ్వనాథుడి ఆలయంకు నాగుపాము వచ్చి.. శివలింగాన్ని చుట్టుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది శివయ్య మహిమే అంటూ భక్తులు పూజలు చేశారు. కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
చూశారా ఈ అద్భుతం.. నెల్లూరు జిల్లాలో ఓ నాగుపాము.. శివలింగాన్ని చుట్టుకుని దర్శనమచ్చింది. దీంతో భక్తులు ఉప్పొంగిపోయారు. శివనామస్మరణలో పులకరించిపోయారు. జిల్లాలోని చెర్లోపల్లి రైల్వేగేటు దగ్గర ఉన్న విశ్వనాథుడి టెంపుల్ ఉంది. అయితే గురువారం రాత్రి పాలభిషేకం చేసి భక్తులకు ప్రసాదం పంచుతుండగా ఒక నాగుపాము ఆలయం వద్దకు వచ్చింది. ఆ కార్యం కోసమే వచ్చినట్లుగా బరా బరా పాకుతూ వెళ్లి శివలింగాన్ని చుట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ శివయ్య తమకు ఈ రూపంలో దర్శనమిచ్చాడు అంటూ తన్మయత్వంలో మునిగితేలారు. కొంతమంది ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ శివలింగం సమీపాన ఉన్న పుట్టు నుంచి ఈ పాము వచ్చింది స్థానికులు చెబుతున్నారు. కాసేపు శివయ్య చెంత సేదతీరిన ఆ పాము తిరిగి పుట్టలోకి వెళ్లిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి