Watch: శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..

|

Nov 19, 2024 | 4:59 PM

కార్తీక పౌర్ణమి కావడంతో శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీకమాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయానికి వెళ్లిన భక్తులకు ఎలుగు బంట్లు దర్శనమిచ్చాయి. అంతే ఎలుగుబంట్లను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు.

జిల్లాలోని మందస మండలం సువర్ణపురం గ్రామ శివాలయంలో తెల్లవారుజామున ఎలుగు బంట్లు హల్చల్ చేసాయి.కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున కుటుంబ సమేతంగా శివుని దర్శనం చేసుకోడానీకి వచ్చినట్లు తల్లి ఎలుగుబంటి రెండు పిల్ల ఎలుగుబంట్లు శివాలయంకి వచ్చాయి. శివాలయానికి వెళ్ళిన భక్తులు ఎలుగుబంట్లును చూసి భయంతో పరుగులు పెట్టారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు గ్రామస్తులు. ఆలయంలోనే ఎలుగుబంట్లు తిష్ట వేయటంతో స్థానికులు కేకలు వేస్తూ ఎలుగుబంట్లును ఆలయం నుండి బయటకు తరిమి వేసారు. ఎలుగుబంట్లు సంచారoపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవటం లేదనీ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు రాత్రి,పగలు కూడా జనావాసాల్లోకి చొరబడి భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక మాసం కావడంతో తెల్లవారుజామున నదీ స్నానానికి వెళ్లాలన్నా, ఆలయాల్లో దీపాలు వెలిగించాలన్నా భయంగా ఉందంటున్నారు. ఎలుగుబంట్లు ఆహారం దొరక్క అరటిపళ్లు, కొబ్బరికాయలకోసం ఆలయాల్లోకి వచ్చేస్తున్నాయని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.