Tirumala Tirupati: తిరుమలలో అన్యమత వస్తువుల విక్రయం.. టీటీడీ నిఘా ఏమైంది.?

Updated on: Dec 10, 2024 | 4:44 PM

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. అయితే అన్యమత ప్రచారం ఎప్పుడూ చర్చగానే నడుస్తుంది. తరచూ ఈ అంశం వివాదాస్పదంగా మారుతుంది. టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటున్నా నిఘా వైఫల్యం కొనసాగుతూనే ఉంది. టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను తప్పించాలని ఇప్పటికే పాలకమండలి చర్యలు తీసుకుంటోంది. భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా తిరుమలలో అన్యమతం గుర్తు, పేరు ఉన్న స్టీల్ కడియం అమ్మకం కలకలం రేపింది. సీఆర్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న SNC షెడ్ లోని 3 వ నంబర్ షాపులో కొనుగోలు చేసిన స్టీల్ కడియంపై అన్యమతానికి చెందిన గుర్తులు భక్తుడు కనిపెట్టాడు. దీంతో టీటీడీ అలెర్ట్ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించు కున్నారు. అనంతరం షాపింగ్ చేశాడు. SNC షెడ్ లోని 3 వ నంబర్ షాపులో స్టీల్ కడియం కొనుగోలు చేసారు శ్రీధర్. వసతి పొందిన గదికి వెళ్లి స్టీల్ కడియంను గమనించాడు శ్రీధర్. స్టీల్ కడియంపై అన్యమతం గుర్తు, పేరు ఉండటంతో అవాక్కైన భక్తుడు విషయాన్ని టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాడు. చైర్మన్ ఆదేశంతో స్పందించిన విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది భక్తుడిని వెంట తీసుకెళ్లి షాప్ లో తనిఖీలు నిర్వహించారు. షాపును తాత్కాలికంగా మూసివేసి విచారణ చేపట్టారు. మరోసారి అన్య మతానికి సంబంధించిన వస్తువులు తిరుమలలో బయటపడటం చర్చగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow Us