Sudarshan Setu: ద్వారకలో అద్భుతం.. తీగల వంతెన ప్రారంభం..! ఇదిగో వీడియో.

|

Feb 27, 2024 | 8:19 AM

గుజరాత్‌లోని ద్వారకలో దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు.

గుజరాత్‌లోని ద్వారకలో దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 2017 అక్టోబర్‌లో మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్‌పై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్‌పాత్‌ కూడా ఉంది. దీనిపై రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. ఈ వంతెనపై పలు చోట్ల సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్‌ విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. ద్వారకా పట్టణానికి ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి బెట్‌ ద్వారకా ద్వీపంలో ఉన్న ద్వారకాదీశ్‌ ఆలయంలో ప్రధాని పూజలు చేయనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on