చైనాలో అద్భుతం !! భూమి లోపల దట్టమైన అడవి !! చూస్తే నివ్వెరపోతారు

|

May 28, 2022 | 9:04 AM

చైనాలో అద్భుతం జ‌రిగింది. ఒక పురాతనమైన అడవి వెలుగులోకి వచ్చింది. అదికూడా భూమిలోప‌ల. చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్‌ అటానమస్‌ రీజియన్‌ లేయ్‌ కౌంటీలోని ఓ సింక్‌ హోల్‌లో దట్టమైన అడవిని కనుగొన్నారు.

చైనాలో అద్భుతం జ‌రిగింది. ఒక పురాతనమైన అడవి వెలుగులోకి వచ్చింది. అదికూడా భూమిలోప‌ల. చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్‌ అటానమస్‌ రీజియన్‌ లేయ్‌ కౌంటీలోని ఓ సింక్‌ హోల్‌లో దట్టమైన అడవిని కనుగొన్నారు. మే 6న గుహ అన్వేషకులు దీన్ని క‌నుగొన్నారు. ఈ సింక్‌హోల్ అడుగున 40 మీట‌ర్ల ఎత్తైన చెట్లున్నాయి. అంటే కొబ్బరి చెట్లకంటే రెండింత‌లు ఎత్తయినవి అన్నమాట‌. దీని లోపల మొత్తం చెట్లతోనే విస్తరించి ఉంది. ఆ చెట్ల కొమ్మలు సింక్‌హోల్ పైవ‌ర‌కూ ఉన్నాయి. ఈ అడవి చూడ‌ముచ్చట‌గా ఉంద‌ని అన్వేష‌కులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైర‌ల్ అవుతోంది. కాగా ఈ సింక్‌హోల్‌ 1,004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పుతో 630 అడుగుల లోతుతో ఉంది. ఈ సింక్‌హోల్ ఘ‌న‌పరిమాణం 5 మిలియ‌న్ క్యుబిక్ మీట‌ర్లకు మించి ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదలలేని స్థితలో తల్లి పక్షి.. ఆహారాన్ని అందిస్తున్న పిల్ల పక్షి.. హృదయాలను కదిలిస్తున్న వీడియో

రింగ్‌లో ఓటమి ఎరుగని భారత్‌ రెజ్లర్‌.. బ్రూస్‌ లీకే గురువు !! ఎవరో తెలుసా ??

ఆ ఊళ్లో మనుషులు, పశుపక్షాదులు అందరూ అంధులే !!

 

Published on: May 28, 2022 09:04 AM