జనక్‌పూర్ రైలు టిక్కెట్ కొనేందుకు EMI సౌకర్యం !! వివరాలు ఇవే

|

Jan 26, 2023 | 8:02 PM

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామమందిరాన్ని జనవరి 1, 2024న ప్రారంభించనున్నారు. ఇప్పటికే అయోధ్య సందర్శకుల సంఖ్య రెట్టింపు అయింది.

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామమందిరాన్ని జనవరి 1, 2024న ప్రారంభించనున్నారు. ఇప్పటికే అయోధ్య సందర్శకుల సంఖ్య రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే కొత్త రైలును ప్రారంభించింది. ఢిల్లీ, అయోధ్య, నేపాల్‌లోని జనక్‌పూర్‌ల మధ్య ప్రత్యేక రైలు మొదలైంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ధర 39 వేల 995 రూపాయలు. ఈ రైలు ప్రయాణం 7 రోజులు ఉంటుంది. రైలు టికెట్‌ను ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోతే, వాయిదాల సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మీరు ఎంచుకున్న తరగతిని బట్టి టికెట్ ధర నిర్ణయిస్తారు. ఏసీ గది, శాఖాహార భోజనం, బస్సు ప్రయాణం, సందర్శనా,​చారిత్రక ప్రదేశాల సందర్శన, బీమా సహా పదుల సంఖ్యలో సౌకర్యాలు ఈ రైలులో అందుబాటులో ఉంటాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాయ్‌ఫ్రెండ్‌ మొహం చూడకూడదని గోడ కట్టించింది..

గుండు కొట్టించుకున్న క్యాన్సర్ పేషెంట్.. సెలూన్ బాయ్ ఏం చేశాడంటే ??

Kim Jong un: రోజంతా తాగుతూ.. ఏడుస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఏమైందంటే ??

Published on: Jan 26, 2023 08:02 PM