ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న జింకలు.. వీడియో చూసారా ?వీడియో
చాలా మంది ట్రాఫిక్ రూల్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. తమతో పాటు ఇతరులను ప్రమాదంలో పడేస్తుంటారు. మూగజీవాలు అలా కాదు.. ఒకసారి నేర్పించామంటే ఎప్పటికీ మర్చిపోవు. అలాంటి క్రమశిక్షణ కలిగిన జింక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జింక రోడ్డు దాటుతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నట్లుగా చూపించే వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
జపాన్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో, రద్దీగా ఉండే రోడ్డును దాటే ముందు ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్‌గా మారడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారిలో జింకలూ ఉన్నాయి. జనం చుట్టూ ఉన్నప్పటికీ, జింకలు సిగ్నల్ దగ్గర ప్రశాంతంగా నిలబడి ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ మారే వరకు ఓపికగా వేచి చూసాయి. లైట్ గ్రీన్‌కు మారిన వెంటనే, జింకలు కూడా ట్రాఫిక్ నియమాలు తెలిసినట్లుగా రోడ్డు దాటడం ప్రారంభించాయి. జపాన్‌లోని నారా పార్క్ జింకలకు ప్రసిద్ధి. అక్కడ అవి స్వేచ్ఛగా తిరుగుతాయి. పర్యాటకులు తమ చేతులతో వాటికి ఆహారం పెడతారు. ప్రతిగా జింకలు కూడా తల వంచి తమ కృతజ్ఞతను తెలియజేస్తాయి. ఓ పర్యాటకురాలు తీసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :