Viral Video: బౌలింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లోనూ ఇరగదీశాడు.. భార్య జయతో కలిసి స్టెప్పులేసిన దీపక్

చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ దీపక్ చాహర్ ఇన్ స్ట్రాగ్రామ్(Instagram) వేదికగా ఓ డ్యాన్సింగ్ వీడియో పంచుకున్నారు. తన భార్య జయ భరద్వాజ్ తో దీపక్(Deepak Chahar) చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపక్, జయ ల వివాహం...

Viral Video: బౌలింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లోనూ ఇరగదీశాడు.. భార్య జయతో కలిసి స్టెప్పులేసిన దీపక్
Deepak Chahar Dance

Updated on: Jun 21, 2022 | 3:29 PM

చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ దీపక్ చాహర్ ఇన్ స్ట్రాగ్రామ్(Instagram) వేదికగా ఓ డ్యాన్సింగ్ వీడియో పంచుకున్నారు. తన భార్య జయ భరద్వాజ్ తో దీపక్(Deepak Chahar) చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపక్, జయ ల వివాహం జూన్ 1న ఆగ్రాలో జరిగింది. ఈ పెళ్లికి అతని బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు, వివాహ రిసెప్షన్‌కు చెన్నై సూపర్ కింగ్స్, భారత క్రికెట్ జట్టులోని అతని సహచరులు హాజరయ్యారు. ఈ వీడియోకు దీపక్ చాహర్.. ఈ డ్యాన్సింగ్ వీడియోను షేరు చేసుకునే ముందు తాను చాలా ఒత్తిడిలో ఉన్నానని, బౌలింగ్ చేస్తున్నప్పుడు క్రికెట్ పిచ్‌పై కంటే ఎక్కువ ఒత్తిడికి గురయ్యానని ట్యాగ్ లైన్ రాశారు. దీనిని చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీపక్ చాహర్ క్రికెట్ లోనే కాదని, డ్యాన్స్ స్టెప్పులతోనూ ఇరగదీశారని కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలకూ ఏ మాత్రం తీసిపోడని ప్రశంసిస్తున్నారు.