Solar Eclipse: ప్రపంచాన్ని వణికిస్తున్న సూర్యగ్రహణం.. విశ్వయుద్ధానికి సంకేతమంటూ ప్రచారం.. కారణం..?
ఏప్రిల్ 30, శనివారం.. చైత్ర అమావాస్య.. పైగా సూర్యగ్రహణం.. దీంతో ప్రపంచమంతా ఒకింతి ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఏర్పడుతున్న తొలి సూర్యగ్రహణం యుద్ధ భయాలను పెంచింది. గ్రహాల రాశి పరివర్తనం విపత్తు సంకేతమన్న ప్రచారం జరుగుతోంది.
ఏప్రిల్ 30, శనివారం.. చైత్ర అమావాస్య.. పైగా సూర్యగ్రహణం.. దీంతో ప్రపంచమంతా ఒకింతి ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఏర్పడుతున్న తొలి సూర్యగ్రహణం యుద్ధ భయాలను పెంచింది. గ్రహాల రాశి పరివర్తనం విపత్తు సంకేతమన్న ప్రచారం జరుగుతోంది. ఖగోళంలో జరిగే మార్పులు భూమిపై ప్రభావం చూపుతాయా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? వైజ్ఞానికులు ఏమంటున్నారు? ప్రత్యేక కథనం మీకోసం.. ఏప్రిల్ 29న కుంభరాశిలో శని ప్రవేశం జరిగింది. దీంతోబాటు రవి, గురు గ్రహాల రాశి పరివర్తనం కూడా ఈ నెల్లోనే జరిగింది. మరోవైపు రవి, చంద్ర, రాహువులు మూడూ మేషరాశిలో ఉండటం యుద్ధ వాతావరణాన్ని సూచిస్తోందంటున్నారు. మూడు గ్రహాల రాశి పరివర్తనాన్ని గ్రహ యుద్ధమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.దీంతోబాటు శని అమావాస్యనాడు వస్తున్న సూర్యగ్రహణం ప్రళయ సంకేతమని కూడా ప్రచారం జరుగుతోంది. 2022లో తొలి సూర్యగ్రహణం తర్వాత జపాన్-ఇంగ్లండ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని సోషల్ మీడియాలో కథనాలు వ్యాపించాయి. గ్రహాల రాశి పరివర్తనం తర్వాత రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తలు ముదిరి విశ్వ యుద్ధానికి దారితీస్తాయన్న పోస్టులు వైరల్ అయ్యాయి. అలాగే పొరుగున పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్‌లో అధికార కుమ్ములాటలతో అస్థిరత మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..