Gussadi Celebrations: ఆకట్టుకుంటున్న దండారి సంబరాలు.. డ్యాన్స్‌లతో అదరగొట్టిన ఆదివాసులు.! (వీడియో)

|

Nov 07, 2021 | 3:24 PM

ఆదివాసులు ఎదురుచూసే అతి పెద్ద సంబరాలైన గుస్సాడీ దండారి ఉత్సవాలు తాజాగా ప్రారంభం అయ్యాయి. గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంటి ముందు ఏత్మాసుర్ దేవతలకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఆదివాసులు ఎదురుచూసే అతి పెద్ద సంబరాలైన గుస్సాడీ దండారి ఉత్సవాలు తాజాగా ప్రారంభం అయ్యాయి. గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంటి ముందు ఏత్మాసుర్ దేవతలకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మంచిర్యాలా జిల్లా దండెపల్లి మండలంలోని పలు గ్రామాల్లో.. ఈ దండారి ఉత్సవాలు జరుపుకుంటారు. నాటికలు, పాటలు, నృత్యలు, కోలాటం ప్రత్యేక కార్యక్రమాలు ఆదివాసులు ఆయా గ్రామాల నుంచి వచ్చి ఉత్సాహంగా పాల్గొని నిర్వహిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర , చత్తీస్‌గఢ్, జార్ఖండ్ నుంచి తరలివచ్చారు ఆదివాసీలు‌.

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Published on: Nov 07, 2021 03:24 PM