Dalai Lama: బుద్ధుడి మార్గాన్ని అనుసరించాలి.! టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఉపదేశం.

|

Dec 25, 2023 | 5:02 PM

ప్రపంచశాంతితోపాటు వ్యక్తిగత ఆనందం కోసం బోధిసత్వుడి విధానాలను అనుసరించాలని దలైలామా పిలుపునిచ్చారు. బోధిసత్వుడి సూత్రాలను అనుసరించడం వల్ల తనకు వ్యక్తిగతంగా ఎంతో మేలు జరిగినట్లు ఆయన చెప్పారు. పాళి, సంస్కృతం.. వీటిలో ఏ సంప్రదాయంలో బౌద్ధాన్ని అనుసరిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరిలో కరుణను నింపాలని ఉద్బోధించారు. మనోవికాసాన్ని కలిగించే బోధిచిత్త ద్వారా బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని, అంతర్గత బలాన్నిచ్చే..

‘సంప్రదాయాల అనుసంధానం, ఆధునికత స్వీకరణ’ పేరిట బుద్ధుని బోధనలపై అంతర్జాతీయ సంఘ వేదిక నిర్వహిస్తున్న మూడు రోజుల చర్చా కార్యక్రమాన్ని బుధవారం బోధిగయలో ప్రారంభించారు టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా. అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రపంచశాంతితోపాటు వ్యక్తిగత ఆనందం కోసం బోధిసత్వుడి విధానాలను అనుసరించాలని దలైలామా పిలుపునిచ్చారు. బోధిసత్వుడి సూత్రాలను అనుసరించడం వల్ల తనకు వ్యక్తిగతంగా ఎంతో మేలు జరిగినట్లు ఆయన చెప్పారు. పాళి, సంస్కృతం.. వీటిలో ఏ సంప్రదాయంలో బౌద్ధాన్ని అనుసరిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరిలో కరుణను నింపాలని ఉద్బోధించారు. మనోవికాసాన్ని కలిగించే బోధిచిత్త ద్వారా బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని, అంతర్గత బలాన్నిచ్చే ఈ ప్రక్రియను సాధన చేస్తే కోపం, ద్వేషం, అసూయ తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమానికి అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు వివిధ దేశాల నుంచి 2 వేల మందికి పైగా బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. ఈ నెల 23న మహాబౌద్ధ స్తూపం వద్ద ప్రపంచ శాంతి ప్రార్థన సమావేశంలో దలైలామా పాల్గొంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 25, 2023 05:02 PM