దినసరి కూలీకి రూ.35 కోట్ల జీఎస్‌టీ బిల్లు

Updated on: Nov 18, 2025 | 6:14 PM

పంజాబ్‌లోని మోఘాకు చెందిన ఒక దినసరి కూలీ అజ్మీర్ సింగ్‌కు ₹35 కోట్ల భారీ జీఎస్టీ బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యాడు. తన ఆధార్, పాన్ వివరాలను దుర్వినియోగం చేసి కంపెనీ రిజిస్టర్ అయిందని ఆరోపించాడు. గతంలోనూ ఇలాంటి నోటీసు వచ్చినప్పటికీ చర్యలు లేకపోవడంతో, ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాడు.

పంజాబ్‌లోని మోఘాకు చెందిన రోజూవారీ కార్మికుడికి 35 కోట్ల రూపాయల మేర జీఎస్టీ బిల్లు రావడంతో అతను షాకయ్యాడు. షాకైన ఆ వ్యక్తి జీఎస్‌టీ శాఖ‌ను క‌లిశాడు. మోఘాలోని బోహ్నా చౌక్‌కు చెందిన అజ్మీర్ సింగ్ అనే రోజువారి కార్మికుడికి 35 కోట్ల జీఎస్టీ బిల్లు వ‌చ్చింది. తిండి కోసం కష్టపడే త‌న‌కు ఆ బిల్లు ఎలా వ‌చ్చిందా అని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశాడత‌ను. గ‌తంలోనూ ఓ సారి అజ్మీర్ సింగ్‌కు భారీగానే జీఎస్టీ బిల్లు వ‌చ్చింది. 2022లో అత‌నికి 21 ల‌క్ష‌ల జీఎస్టీ నోటీసు జారీ అయింది. అప్పుడు కూడా అజ్మీర్ సింగ్‌ జీఎస్టీ ఆఫీసుకెళ్లాడు. విచార‌ణ చేయ‌మ‌ని కోరాడు. కానీ ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇప్పుడు రెండేళ్లే త‌ర్వాత 35 కోట్ల జీఎస్టీ బిల్లు వచ్చింది. భారీ మొత్తంలో జీఎస్టీ నోటీసు రావ‌డంతో అజ్మీర్ సింగ్‌.. లుథియానాలోని జీఎస్టీ ఆఫీసుకెళ్లాడు. సీ కే ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ పేరుతో ఆ బిల్లు జారీ అయ్యింది. అయితే అజ్మీర్ సింగ్ ఆధార్ కార్డు, ప్యాన్ డిటేల్స్‌తో ఆ కంపెనీ రిజిస్ట‌ర్ అయిన‌ట్లు తెలిసింది. లుథియానాలోని గిల్ రోడ్డులో కంపెనీ ఉన్న‌ట్లు చిరునామా ఇచ్చారు. బ‌హుశా త‌న ఆధార్ కార్డును కోవిడ్ స‌మ‌యంలో సేక‌రించి ఉంటార‌ని అజ్మీర్ సింగ్ ఆరోపించాడు. త‌న‌కు ప్యాన్ కార్డు లేద‌ని, అస‌లు దాని గురించి ద‌ర‌ఖాస్తు కూడా చేయ‌లేద‌న్నాడు. పోలీసు కేసు పెట్టాలని జీఎస్టీ శాఖ అజ్మీర్‌ సింగ్‌కు సూచించింది. ఆ సూచ‌న‌మేర‌కు మోఘా సిటీలోని సౌత్ పోలీసు స్టేష‌న్‌కు వెళ్లాడ‌త‌ను. జీఎస్టీ బిల్లుపై విచార‌ణ చేప‌ట్టాల‌ని అజ్మీర్ సింగ్ డిమాండ్ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంపర్‌ ఆఫర్‌ పిల్లలను కంటే రూ. 30 లక్షలు

దారుణం.. యజమానిని కట్టేసి భారీ దోపిడీ

దుర్గమ్మ ఆలయంలో అద్భుతం.. చూడటానికి రెండు కళ్ళు చాలవు

దాబాలో లంచ్ చేసి బ్యాగ్ మరిచిపోయిన కస్టమర్‌.. ఓపెన్‌ చేయగా

ఐ – బొమ్మ రవి కేసులో ట్విస్టులే ట్విస్టులు