Chicken Biryani: కోడి బిర్యానీ ఆర్దరిస్తే.. జెర్రి బిర్యానీ తెచ్చాడు..! కస్టమర్ షాక్..

|

Oct 01, 2023 | 1:11 PM

బిర్యానీ అంటే చాలు.. లొట్టలేసుకునే తినే నాన్‌వెజ్‌ ప్రియులకు అప్పుడప్పుడు షాకిస్తుంటారు రెస్టారెంట్‌ నిర్వహకులు. సరైన శుభ్రత, శుచి లేకుండా వంటలు వండేస్తుంటారు. అప్పడప్పుడు ఆర్డరిచ్చిన ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలతో పాటు బల్లులు, జెర్రులు వస్తుండటంతో బయట భోజనం చేయాలంటేనే హడలెత్తుతున్నారు మాంసాహార వంటలు తినే కస్టమర్లు.. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్‌ నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్ తెప్పించుకున్నాడు కస్టమర్‌.

బిర్యానీ అంటే చాలు.. లొట్టలేసుకునే తినే నాన్‌వెజ్‌ ప్రియులకు అప్పుడప్పుడు షాకిస్తుంటారు రెస్టారెంట్‌ నిర్వహకులు. సరైన శుభ్రత, శుచి లేకుండా వంటలు వండేస్తుంటారు. అప్పడప్పుడు ఆర్డరిచ్చిన ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలతో పాటు బల్లులు, జెర్రులు వస్తుండటంతో బయట భోజనం చేయాలంటేనే హడలెత్తుతున్నారు మాంసాహార వంటలు తినే కస్టమర్లు.. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్‌ నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్ తెప్పించుకున్నాడు కస్టమర్‌. బిర్యానీలో బొద్దింక రావడంతో తన ట్విట్టర్‌ ఖాతాలో ఫోటోలు పెట్టి జీహెచ్‌ఎంసీ అధికారులు సదరు రెస్టారెంట్‌లో తనిఖీలు చేయాలని కోరాడు. ఈ ఉదంతం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలోని సత్య మ్యాక్స్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో బిర్యానీ తినేందుకు వెళ్లిన ఓ కస్టమర్‌కు ఇదే తరహా అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌కు వెళ్ళిన కస్టమర్ బిర్యానీ అర్దరిచ్చాడు. మధ్యాహ్నం సమయంలో లేటుగా వెళ్ళాడేమో.. ఆకలితో ఉన్న ఆ కస్టమర్‌కు బిర్యానీ సర్వ్‌ చేయగానే ఆబగా లాగించేస్తున్నాడు. మధ్యలో చికెన్‌ ముక్కకు బదులు ఏదో పాకుడు జీవి కనిపించింది. దీంతో అవాక్కయిన కస్టమర్‌ దాన్ని తేరిపారా చూశాడు.. అంతే అతని గుండె ఝల్లుమంది. అది చికెన్ ముక్క కాదు. ఒళ్ళంతా కాళ్ళతో పాకులాడే జెర్రిగా గుర్తించాడు. వెంటనే వాంతి వచ్చినంత పనైంది..! కొద్దిసేపు కంగారుపడ్డ ఆ కస్టమర్‌ తేరుకుని హోటల్‌ సిబ్బందికి బిర్యానీలో వచ్చిన జెర్రిని చూపించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిర్యానీలో వచ్చిన జెర్రి ఫోటోలు తీసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదుకు సిద్ధమయ్యాడు. సదరు హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కస్టమర్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..