ప్రాణాలకు తెగించి గిరిజనుల సాహసం.. కరెంటు స్తంభాలతో వారధి.. వీడియో
గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కోస్తా జిల్లాలు తడిసిముద్దయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో వరద ఉధృతికి, పిడుగుపాటుకు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో ఇద్దరు గల్లంతవ్వగా, మరో ఇద్దరు మృతి చెందారు.
గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కోస్తా జిల్లాలు తడిసిముద్దయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో వరద ఉధృతికి, పిడుగుపాటుకు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో ఇద్దరు గల్లంతవ్వగా, మరో ఇద్దరు మృతి చెందారు. కుండపోతగా కురిసిన వానలకు కొండ వాగులు, వంకలు, నదులు ఉధృతరూపం దాల్చాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ మన్యంలో వాగులు, కాల్వలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అరకులోయ మండలం బొండాం పంచాయతీ కొత్తవలస గ్రామానికి వెళ్ళే అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి..
మరిన్ని ఇక్కడ చూడండి: సెహ్వాగ్ నోట పవన్ మాట! అచ్చం పవన్‌లాగే చేసిన సెహ్వాగ్..! వీడియో నెట్టింట వైరల్