ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో ఓ మహిళ రెస్టారెంట్‌లో పాదాన్ని గోక్కుని, చేతులు కడుక్కోకుండానే ఆహారం తినడం, మరో వీడియోలో ఫోర్క్‌తోనే పాదాన్ని గోక్కోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలు కోట్లాది వ్యూస్ సాధించగా, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. అందరూ కలిసి భోజనం చేసే రెస్టారెంట్‌లో ఆమె చేసిన పని నెటిజన్లను తీవ్ర అసహ్యానికి గురిచేసింది. ఈ ఘటన ప్రయాణాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఇతరుల పట్ల ఉండాల్సిన బాధ్యతపై తీవ్ర చర్చకు దారితీసింది. కార్నివాల్ క్రూయిజ్ షిప్ డైనింగ్ ఏరియాలో సదరు మహిళ పదేపదే తన పాదాన్ని బలంగా గోక్కుని, ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండానే అదే చేత్తో పిజ్జా తింటూ కనిపించింది. అంతటితో ఆగకుండా, మరొక వీడియోలో ఏకంగా భోజనానికి ఉపయోగించే ఫోర్క్ తోనే పాదాన్ని గోక్కోవడం కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఏకంగా 11 మిలియన్లు, 7 మిలియన్లకు పైగా వీడియోలను వీక్షించి రకరకాలుగా స్పందించారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రూయిజ్ వంటి వేలాది మంది ప్రయాణించే పరిమిత ప్రదేశాల్లో ఇలాంటి అసహ్యకర ప్రవర్తన వల్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని మండిపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అందరి ఆరోగ్యానికి ఎంత అవసరమో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రెండ్ మారింది గురూ.. వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం.. మిస్టరీ ఛేదించిన శాస్త్రవేత్తలు!
